జీబీసీ సబ్‌ డివిజనలో వేధిస్తున్న లస్కర్ల కొరత

ABN , First Publish Date - 2021-11-08T06:47:02+05:30 IST

తుంగభద్ర ఎగువ కాలువకు అనుబంధం గా గుంతకల్లు బ్రాంచ కెనాల్‌(జీబీసీ)లోని ఉరవకొండ సబ్‌డివిజన పరిధి లో లస్కర్ల కొరత తీవ్రంగా ఉంది.

జీబీసీ సబ్‌ డివిజనలో వేధిస్తున్న లస్కర్ల కొరత
జీబీసీ కార్యాలయం

ఉరవకొండ, నవంబరు 7: తుంగభద్ర ఎగువ కాలువకు అనుబంధం గా గుంతకల్లు బ్రాంచ కెనాల్‌(జీబీసీ)లోని ఉరవకొండ సబ్‌డివిజన పరిధి లో లస్కర్ల కొరత తీవ్రంగా ఉంది. యేళ్లు గడిచినా లస్కర్ల పోస్టులు భర్తీ కాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీబీసీ కాలువ 59.4 కి.మీ.ల పొడవు ఉంది. కాలువ కింద 15,750 ఎకరాల ఆయకట్టు ఉంది. జీబీసీ ఆధునీకరణ పనుల్లో భాగంగా మొదటి ప్యాకేజీలో 28 కి.మీ.ల పనులు పూర్తి కాగా, 28 నుంచి 59 కి.మీ. వరకూ కాలువ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో ఆధునీకరణ పనులు ఆగిపోయా యి. సబ్‌డివిజన పరిధిలో 26 మంది లస్కర్లు ఉండాల్సి ఉండగా, కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు.

                           

మరోవైపు జీబీసీ కాలువలో ముళ్ల పొదలు పెరిగి పోయాయి. వాటిని తొలగించకపోవడంతో చివరి ఆయకట్టు కు సక్రమంగా నీరు అందడం లేదు. కాలువ పర్యవేక్షణ కూడా అటకెక్కిం ది. ఆయకట్టు రైతుల కంటే నాన ఆయకట్టు రైతులు యథేచ్ఛగా నీటిని అక్రమంగా వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కాలువలోని 6, 9 డిస్ర్టిబ్యూటర్ల కింద అధికసంఖ్యలో ఆయకట్టు ఉంది. కాలువకు నీటిని వదిలే ముందే ముళ్ల పొదలు, గుర్రపుడెక్క తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకి లే కుండా చూడాల్సిన బాధ్యత లస్కర్ల మీద ఉంటుంది. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఖాళీ పోస్టులు భర్తీ చేసుకునేందుకు ప్రతిపాదనలు పం పినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి లస్కర్ల పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-11-08T06:47:02+05:30 IST