మల్లన్న ఆలయ ద్వారాలకు వెండి తొడుగులు

ABN , First Publish Date - 2021-07-30T03:49:01+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సుమారు రూ.4కోట్లతో వ్యయంతో ఐదు ద్వారాలకు బిగించనున్న వెండితొడుగుల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

మల్లన్న ఆలయ ద్వారాలకు వెండి తొడుగులు

చురుగ్గా సాగుతున్న తయారీ పనులు


చేర్యాల, జూలై 29 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సుమారు రూ.4కోట్లతో వ్యయంతో ఐదు ద్వారాలకు బిగించనున్న వెండితొడుగుల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన పలువురు కళాకారులు కొద్దిరోజులుగా ఆలయ ఈవో బసగది ఆవరణలో పనులు నిర్వహిస్తున్నారు. యేటా భక్తుల రాక పెరగడం, ఆదాయం కూడా రికారు ్డస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పరిసరాలతో పాటు ఆలయద్వారాలను శోభాయమానంగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు సంకల్పించి ద్వారాలకు వెండి తొడుగులు చేయించాలని సూచించారు.  కొమురవెల్లి మల్లన్నకు భక్తులు మొక్కుబడులుగా అందించిన 860 కిలోల వెండి మిశ్రమాన్ని కొన్ని నెలల క్రితం చర్లపల్లిలోని మెల్టింగ్‌ కంపెనీలో కరిగించారు. 615 కిలోల నాణ్యమైన వెండి (999హాల్‌మార్క్‌)ని పొందారు. అందులోంచి 438 కిలోల వెండితో ఆలయ గర్భాలయం, అంతరాలయం, అర్ధమండపంలో 5 ద్వారాలకు తొడుగులు చేయించేందుకు టెండర్‌ నిర్వహించగా తిరుపతికి చెందిన బాలాజీ మెటల్‌ వర్క్స్‌ వారు టెండర్‌ పొందారు. మెల్టింగ్‌ కంపెనీ నుంచి పొందిన వెండి బిల్లలను రేకుగా తయారు చేసుకుని తీసుకొచ్చిన టెండర్‌దారులు ఈనెల 9న పనులు ప్రారంభించారు. ద్వారాలకు ఉన్న డిజైన్‌ కొలతల ఆధారంగా రేకులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు తయారీపనులు సగానికి పూర్తికావొచ్చాయి. శ్రావణమాసంలో ద్వారాలకు బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-07-30T03:49:01+05:30 IST