Advertisement

డిసెంబరు నాటికి అప్రోచ్‌ రోడ్డు పూర్తి

Sep 29 2020 @ 06:07AM

 ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి ఆదేశం


కొమనాపల్లి (జలుమూరు) సెప్టెంబరు 28: కొమనాపల్లి వద్ద వంశధార నదిపై నిర్మించిన వంతెన అప్రోచ్‌ రోడ్డు పనులు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని రోడ్లు, భవనాలశాఖ ఎస్‌ఈ కె. కాంతిమతి ఆదేశించారు. సోమవారం అప్రోచ్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  మా ట్లాడుతూ..వంతెన పనులు పూర్తయినప్పటికీ అప్రోచ్‌ రోడ్డు పనులు నిలిచిపోవడంతో జలుమూరు, సరుబుజ్జిలి మండలాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు.


పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే దసరా నాటికి తిమడాం అనుబంధ రోడ్డు పనులు పూర్తిచేసి వాహనాలు రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, ఏఈ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.