సహకార ఎన్నికలపై సందిగ్ధం

ABN , First Publish Date - 2022-09-29T07:13:30+05:30 IST

సహకార ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభు త్వం సందిగ్ధంలో పడిందన్న వాదనలు రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

సహకార ఎన్నికలపై సందిగ్ధం
పులిమేరు పీఏసీఎస్‌ కార్యాలయం

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన 8 నిర్వహించాలని కేంద్రం ఒత్తిడి
ఫలితాలపై వైసీపీలో సందేహం 8 వ్యతిరేకత వస్తే సాధారణ ఎన్నికలపై ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన

(పెద్దాపురం)
సహకార ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభు త్వం సందిగ్ధంలో పడిందన్న వాదనలు రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వెంటనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా ముందుకెళ్లేందుకు అధికార వైసీపీ తర్జన భర్జన పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో అంత సానుకూలత లేకపోవడంతో ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్న వాదన వినిపిస్తోంది. 2023లో సాధారణ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న వాదనల నేప థ్యంలో ఇప్పట్లో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సాహసం చేయలేకపోతోందని తె లుస్తోంది. కరోనా సాకుతో రెండేళ్లపాటు ఎన్నికలకు వెళ్లకుండా ఉండిపోయిన ప్రభుత్వం సాధారణ ఎన్నికల వరకు వాయిదాలు వేసుకుంటూ వెళ్లే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. సహకార సంఘాలను పూర్తిగా కంఫ్యూటరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. దీంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని షరతు విధించింది. అందుకు అయిష్టంగానే రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. ఎన్నికల నిర్వహణకు అడుగు మాత్రం ముందుకు పడడంలేదు. సహ కార సంఘాల సభ్యుల జాబితాలను అధికార పార్టీ నాయకులు, సమన్వయకర్తలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుతం గ్రామాల్లో వైసీపీ అంత అనుకూల వాతావరణం లేదని, ఈ పరిస్థితుల్లో సహకార ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా వస్తాయో అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. జిల్లాలో 72 సహకార సంఘాలు ఉన్నాయి. అలాగే ఓటర్ల జాబితాల వివరాలను సేకరించే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఎన్నికలు ఉమ్మ డి జిల్లా ప్రాతిపాదికగా ఉంటాయా, కొత్త జిల్లాల కు ప్రత్యేకంగా నిర్వహిస్తారా అనేది స్పష్టత లేదు. వాస్తవానికి 2013లో జిల్లాలో ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ఎన్నికైన పాలకవర్గ పదవీకాలం 2018తో ముగిసింది. అప్పటినుంచి నామినేటెడ్‌ పాలకవర్గాలు కొనసాగుతున్నాయి. 2019  నుంచి వైసీపీ ప్రభుత్వం సొసైటీలు, డీసీసీబీ పాలకవర్గాలను పొడిగిస్తూ నామినేట్‌ చేస్తూ వస్తోంది. ఆరునెలలకొకసారి పాలకవర్గాలను పొడిగిస్తూ వస్తోంది. ఎన్నికలకు మాత్రం వెళ్లడం లేదు. 1984 సహకార చట్టం ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలంటే  మూడు నెలల ముందుగా సొసైటీల వారిగా సభ్యుల జా బితాలు ప్రదర్శించాలి. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి మార్పులు, చేర్పులు చేయాలి. సహకా ర చట్టం ప్రకారం వెళ్లాంటే ఈ వారంలో సభ్యుల జాబితాలు ప్రదర్శిస్తే డిసెంబర్‌లో నిర్వహించలేని పక్షంలో సాధారణ ఎన్నికల తరువాతే సహకార ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందన్న ప్రచా రం ఉంది. జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌ మాత్రం ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమని, తాము మాత్రం ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమని చెప్పారు.

సమావే శంలో పాల్గొన్న ఎంపీ, జడీ ్ప చైర్మన్‌, కలెక్టర్‌, ఎస్పీ
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం
జిల్లా స్థాయి విజిలె న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ)  సమావేశంలో వక్తలు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 28:  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడడంలో కలెక్టర్‌, ఎస్పీలతోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల పాత్ర ప్రశంసనీయమని ఎంపీ వంగా గీత పేర్కొ న్నారు. బుధవారం కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌లో కలెక్టర్‌ అఽధ్య క్షతన జిల్లా స్థాయి విజిలె న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ గీత, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియా, ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డీఆర్‌వో కె శ్రీధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె రంగలక్ష్మీదేవిలతోపాటు కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులు, వాటి పురోగతి, బాఽధితులకు సహాయం పంపిణీ, ఉపాధి కల్పన, సాఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల పక్షాన నిలిచి వారికి భరోసా కల్పించడంలో జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యల్లో కమిటీ సభ్యులు కీలక భాగస్వామ్యం కావాలన్నారు. కీల క అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. సమావేశానికి జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డాక్టర్‌ మోకా పవన్‌కుమార్‌, బండి వీరలింగేశ్వరరావు, గంగవంశం త్రినాథ్‌దేవ్‌, పిల్లి జ్యోతితోపాటు ఎన్‌జీవో సంస్థల నుంచి ఎస్‌పీ రెడ్డి, ఎన్‌ సుధాంజలి పాల్గొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీ పి శ్రీని వాస్‌, కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహ రావు, వ్యవసాయశాఖ జేడీ ఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.
చివరి వారంలో రెండు ప్రత్యేక గ్రీవెన్స్‌లు
ప్రతి నెల చివరి శనివారం రెండు ప్రత్యేక స్పందన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ కృతికాశుక్లా తెలిపారు. బుధ వారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. ప్రతి నెల చివరి శనివారం ఉదయం ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌, ఉద్యోగ సంఘాల గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్‌ ప్రతి నెల చివరి సోమవారం ఉండేదని, ఈ కార్యక్ర మానికి చివరి సోమవారానికి మార్చినట్టు చెప్పారు. తమ అర్జీల స్వీకరణకు ప్రత్యేక అవకాశం కల్పించాలని ఉద్యోగ సఘాల నేత లు కోరడంతో అందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.

కుల             బహిష్కరణ చే సి వెలివేశారంటూ ఫిర్యాదు
ప్రత్తిపాడు, సెప్టెంబరు 28: తనను అన్యాయంగా కుల బహిష్కరణ చేసి వెలివేయడమే కాకుండా తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్టు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన ఒక వృద్ధ మహిళ ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబుకు ఇటీవల స్పందనలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సగర కులానికి చెందిన తనపై 15 రోజుల కిందట కుల పెద్దలు తనపై కక్ష కట్టి కులబహిష్కరణ చేశారని, 23న రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు దౌర్జన్యంగా తన ఇంటిలోకి ప్రవేశించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారని ఆమె ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ న్యాయం చేయాలని కోరారు.


రెండు నెలలకే ఈనిక దశకు చేరుకున్న వరి చేను
ముందే ఈనిక..
లబోదిబోమంటున్న రైతులు
గ్రోమోర్‌ సెంటర్‌ను మూయించి నిరసన
కోటనందూరు, సెప్టెంబరు 28: ఎన్నో ఆశలతో వేసిన వరి పంట రెండు నెలలకే ఈనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కాక రాపల్లి గ్రామంలోని మన గ్రోమోర్‌ సెంటర్‌ నుంచి మూడు నెలల కిందట ధరణి కంపెనీకి చెందిన ఆర్‌జేఎల్‌ విత్తనాలు 46 బ్యాగ్‌లను రైతులు కొను గోలు చేశారు. నారు వేసి నాట్లు వేశారు. 120 రోజులు పంటకాలం. కానీ రెండు నెలలకే సగభాగం ఈనిక దశలోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందే ఇలా ఈనిక వల్ల పంట నష్టపోవడం ఖాయమని వారు చెబుతున్నారు. ఇప్పటికే రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో రైతుల పరిసితి ఇలానే ఉంది. దీంతో బుధవారం నాడు రైతులు మన గ్రోమోర్‌ సెంటర్‌ ముందు నిరసన తెలిపి షాపును మూయించారు. విషయం తెలుసుకొన్న వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని జరిగిన విష యం రైతులతో చర్చించారు. న్యాయం చేయాలని వారు డిమాండు చేయ డంతో శాస్త్రవేత్తలను తీసుకొచ్చి పరిశీలిస్తామని, తద్వారా గ్రోమోర్‌ ప్రతిని ధులతో చర్చించి విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-09-29T07:13:30+05:30 IST