హోమియోతో కీళ్లనొప్పుల నుంచి విముక్తి

Sep 7 2021 @ 14:02PM

ఆంధ్రజ్యోతి (07-09-2021): కాలు కదిపితే నొప్పి. వంగినా, కూర్చున్నా చెప్పలేనంత బాధ. మందులతో తాత్కాలిక ఉపశమనమే తప్ప పరిష్కారం మాత్రం శూన్యం. ఈ సమస్యకు సర్జరీ ఒక్కటే మార్గమా? అయితే ఆ అవసరం లేకుండా హోమియో చికిత్సతో నమ్మకమైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.


మారుతున్న జీవనవిధానం, శారీరక శ్రమ లోపించడంతో ప్రతి మనిషీ ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నాడు. పోషకాహారలోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఒకే భంగిమలో కూర్చుని పనులు చేయడం లాంటి వాటి వల్ల 20 లేదా 30 ఏళ్ల వయసులోనే నొప్పులు కనిపిస్తున్నాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్‌ అంటారు. దీన్లో దాదాపు వంద రకాలు కనిపిస్తాయి. మోకాళ్లు, వెన్నెముక, మెడ, తుంటి, భుజాలు ఆర్థరయిటి్‌సకు గురువుతూ ఉంటాయి.


అధిక బరువు, శారీరక శ్రమ లోపించడం, హార్మోనల్‌ ఫ్యాక్టర్స్‌ వల్ల కీళ్లు త్వరగా అరుగుతాయి. కీళ్ల అరుగుదలతో వచ్చే ఈ వ్యాధిని ఆస్టియో ఆర్థరయిటిస్‌ లేదా డీజనరేటివ్‌ ఆర్థరయిటిస్‌ అంటారు. మోకాళ్లలో కార్టిలేజ్‌ అరగడం వల్ల, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. ఆర్థరయిటి్‌సలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరయిటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరయిటిస్‌, సర్వైకల్‌ స్పాండిలోసిస్‌, ఆస్టియోపోరోసిస్‌, గౌట్‌, సోరియాటిక్‌ ఆర్థరయిటిస్‌.


కారణాలు

- ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే స్థితి ఆస్టియోఆర్థరయిటిస్‌ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, సరైన వ్యాయామం చేయకపోవడం, వయసు పైబడడం, ఎక్కువగా జాగింగ్‌ చేయడం, ఎక్కువగా మెట్లు ఎక్కడం, మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, రసాయనాల సమతౌల్యం లోపం, హార్మోన్ల ప్రభావం, రోగనిరోధకశక్తి తగ్గడం, గాయాల వల్ల ఆర్థరయిటిస్‌ సమస్య తలెత్తుతుంది.


లక్షణాలు

మోకాలు కదిల్చినప్పుడు తలెత్తే నొప్పి క్రమేపీ నడవలేని స్థితికి చేరుస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉదయం కీళ్లు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. లిగమెంట్లు బలహీనమై మోకాళ్లలో నొప్పి, వాపు ఉంటుంది. నొప్పులు ఉదయం తక్కువగా, రాత్రుళ్లు ఎక్కువగా ఉంటాయి.


వ్యాధి నిర్థారణ

జాయింట్‌ ఎక్స్‌రే, ఎమ్మారై, ఆర్థోస్కోపీ, క్యాల్షియం, ఆర్‌ఎ ఫ్యాక్టర్‌, సీరం యూరిక్‌ యాసిడ్‌ పరీక్షలు 


హోమియో చికిత్స

సర్జరీ అవసరం అనుకున్న చాలా కేసుల్లో హోమియో చికిత్స మెరుగైన జీవితాన్ని అందించగలుగుతుంది. నొప్పికి వాడే మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా, తిరిగి మరింత బాధపెడతాయి. కీలు మార్పిడి సర్జరీతో కొందరికి ప్రయోజనం ఉన్నా హోమియో చికిత్సతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. సరైన వైద్యునితో సరైన చికిత్స తీసుకుంటే జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవచ్చు. 

డాక్టర్‌ మధు వారణాశి

MD, MS(PSYCHO), MC-SEP

ప్రముఖ హోమియో వైద్యులు,

ప్లాట్‌ నెం 188, వివేకానందనగర్‌ కాలనీ,

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌: 8897331110, 8886509509

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.