ఓటీఎ్‌సపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-12-03T06:26:30+05:30 IST

సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా ఓటీఎ్‌సను వేగవంతం చేసి లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాలని ఆర్డీఓ నిశాంతరెడ్డి సూచించారు.

ఓటీఎ్‌సపై స్పెషల్‌ డ్రైవ్‌

కళ్యాణదుర్గం, డిసెంబరు2: సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా ఓటీఎ్‌సను వేగవంతం చేసి లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాలని ఆర్డీఓ నిశాంతరెడ్డి సూచించారు. గురువారం నియోజకవర్గ పరిధిలో ఓటీఎస్‌పై స్పె షల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం, పట్టణంలోని వివిధ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. పథకం పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  


కంబదూరు : మండలంలోని చెన్నంపల్లి, కోటగుడ్డం సచివాలయాలను ఆ ర్డీఓ నిశాంతరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో సచివాలయాలను తనిఖీచేసి ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఈశ్వరయ్యశెట్టి, సిబ్బంది ఉన్నారు. 


యాడికి: ఓటీఎ్‌సతో లబ్ధిదారులకు సంపూర్ణ గృహహక్కు లభిస్తుందని అ నంతపురం ఆర్డీఓ మధుసూదన తెలిపారు. గురువారం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఆయన సంపూర్ణ గృహహక్కు పత్రాలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అలెగ్జాండర్‌, హౌసింగ్‌ ఏఈ రంగనాయకులు, వీఆర్వోలు కుళ్లాయప్ప, కుమార్‌ పాల్గొన్నారు.


పెద్దవడుగూరు: సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజలకు అవగాహన క ల్పించాలని ఆర్డీఓ మధుసూదన సచివాలయ సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలో గురువారం ఆయన ఓటీఎ్‌సపై సిబ్బందితో సమావేశమయ్యారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొనేలా చూడాలని సిబ్బందికి సూచించారు.


పుట్లూరు: మండలంలోని చెర్లోపల్లి, మడ్డిపల్లి సచివాలయాల పరిధిలో గు రువారం సంపూర్ణ గృహ హక్కుపై తహసీల్దార్‌ విజయకుమారి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.


ఉరవకొండ: జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు పత్రం పొందేందుకు వనటైం సెటిల్మెంట్‌ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు మునివేలు సూచించారు. పట్టణంలోని 2వ సచివాలయంలో గురువారం ఓటిఎస్‌ మేళా నిర్వహించారు. మండల వ్యాప్తంగా 226 మంది లబ్ధిదారులు ఓటీఎ్‌సను వినియోగించుకున్నారన్నారు.


గుంతకల్లుటౌన: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా  లబ్ధిదారుల నుంచి రూ.38.8 లక్షలు వసూలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న తెలిపారు. గురువారం నిర్వహించిన మెగా మేళా ద్వారా 34 సచివాలయాల్లో 259 మంది హౌసింగ్‌ లబ్ధిదారులు ఓటీఎస్‌ చెల్లించారన్నారు.


గుత్తి: లబ్ధిదారులు వనటైం సెటిల్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సచివాలయంలో గురువారం మెగా  హౌసింగ్‌ వనటైం సెటిల్‌మెంట్‌ మేళా నిర్వహించారు. ఆ యా సచివాలయాల్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన ప్రక్రియ జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ ఇమామ్‌ హుసేన, ఆర్‌ఐ ఎర్రిస్వామి, టీ ఎంసీ కెరణ్‌, హౌసింగ్‌ అధికారులు సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


రాయదుర్గంటౌన: జగనన్న గృహ రుణ విముక్తి పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమీషనర్‌ జబ్బార్‌ మియా కోరారు. గృహ రుణ విముక్తిని సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులకు గురువారం ఆయన ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. 


Updated Date - 2021-12-03T06:26:30+05:30 IST