‘పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి’

Jun 16 2021 @ 23:57PM
మాట్లాడుతున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

  • జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాల యాల్లో ప్లాంటేషన్‌ జరగాలని ఆదేశించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రీ పార్కులను పరిశీలించాలని సూచిం చారు. మున్సిపాలిటీల్లో చెత్త చెదారం, ముళ్ల పొదలను తొలగించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ రోడ్లలో, అటవీ బ్లాక్‌లలో ప్లాంటేషన్‌ చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి జానకిరాంకు సూచించారు. పంచాయతీరాజ్‌ రహదారులలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖ అధికారిని ఆదేశించారు. మల్టీలెవల్లో రెండు మూడు వరుసల్లో పెద్ద మొక్కలు నాటాలన్నారు. అక్రమ కట ్టడాలను ప్రోత్సహించరాదన్నారు. గ్రామపంచాయతీల్లో శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. పంచాయతీల్లో పారి శుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమీకృత వెజ్‌,నాన్‌వెజ్‌ మార్కెట్లకు త్వరితగతిన స్థలాలను గుర్తించాలని మున్సిపల్‌ కమిష నర్లను ఆదేశించారు. మున్సిపల్‌ హెడ్‌క్వార్టర్‌ పరిధిలో ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లన్నీ పూర్తిగా పచ్చ దనంతో నిండి ఉండాలని, పట్టణాన్ని సుందరీకరించాల్సి బాధ్యత మన్సిపల్‌ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, డీఎం హెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, అటవీశాఖ అధికారి జానకిరామ్‌, పంచాయతీశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Follow Us on: