పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-22T05:40:06+05:30 IST

కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా మండలంలో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది.

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

మూడు రోజుల్లో100 మందికి పాజిటివ్‌

 అధికార యంత్రాంగం అప్రమత్తం 

ఏలేశ్వరం, జనవరి 21: కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా మండలంలో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. మండల ప్రధాన వైద్యాధికారిణి రామలక్ష్మి నేతృత్వంలో మండల ఆరోగ్యవిస్తరాణాధికారి కె.భాస్కరరావు, ఎస్‌.వి.రమణ, వీరన్న తదితర అధికారులు వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వాస్పత్రివద్ద  189 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా 100మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం మండలంలో 122 మంది కొవిడ్‌ బాధితులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్సలు పొందుతున్నట్లు వైద్యాధికారి వెల్లడించారు. వైరస్‌వ్యాప్తి చెందకుండా మండలంలోని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభించారు.

తొండంగి మండలంలో 21 కరోనా కేసులు

తొండంగి: మండలంలోని మూడు పీహెచ్‌సీల పరిధిలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ విమల తెలిపారు. తొండంగి పీహెచ్‌సీ పరిధిలో రెండు రోజుల క్రితం 25మందికి పరీక్షలు జరపగా 15మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు వీరిలో తొండంగికి చెందిన 8 మంది, ఎ.కొత్తపల్లికి చెందిన ఏడుగురు ఉన్నా రన్నారు. వీటితోపాటు ఏవీ నగరం, పీఈ చిన్నయ్యపాలెం, కోదాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసు లు నమోదయ్యాయన్నారు. వీటితోపాటు ఏ.కొత్తపల్లిలో మూడు కేసులు ఉన్నట్లు రవికుమార్‌ తెలిపారు.

సచివాలయ సిబ్బందికి కరోనా

సామర్లకోట: పట్టణంలోని సత్యనారాయణపు రం వార్డు సచివాలయంలో పని చేస్తున్న సిబ్బం ది ఒకరికి శుక్రవారం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం సచివాలయాన్ని మూసివేసి క్లోరినేషన్‌ చర్యలు చేపట్టారు. బాధి తుడిని హోం ఐసోలేషన్‌కు తరలించారు. 

విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌ వేయాలి

సామర్లకోట, జనవరి 21: ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 12 సంవత్సరాల వయసు పైబడిన విద్యార్థులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలని ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు మునిసిపల్‌ అధికారుల ను డిమాండ్‌ చేశారు. శుక్రవారంవారు అయో ధ్యరామపురం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కరోనా, ఒమైక్రాన్‌ కేసులు పెరు గుతున్న నేపథ్యంలో ప్రతీరోజూ తరగతి గదుల ను, మరుగుదొడ్లను శానిటైజ్‌ చేయించాలన్నా రు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆర్‌.అరుణ్‌కు మార్‌, శివప్రసాద్‌, సురేష్‌, ప్రవీణ్‌, డీవై ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ పి.వీరబాబు ఉన్నారు.

మౌలిక వసతులు కల్పించాలి

భానుగుడి (కాకినాడ), జనవరి 21: కాకినాడ నగరంలో పలు పాఠశాలల్లో ఎస్‌ ఎఫ్‌ఐ నాయ కులు ఎం.గంగాసూరిబాబు, జిల్లా కార్యదర్శి టి.రాజా మౌలిక వసతులపై ఆరా తీశారు.  ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడు తూ విద్యార్థులకు మాస్కులు ఉచితంగా పంపి ణీ చేయాలని, ప్రతీ క్లాస్‌రూమ్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు తగ్గట్టు గా తరగతి గదులను ఏర్పాటు చేయాలని డిమా ండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర సహాయ కార్యదర్శి జి.సత్య పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-22T05:40:06+05:30 IST