డ్రోన్‌తో మందుల పిచికారీ

ABN , First Publish Date - 2022-10-08T05:12:14+05:30 IST

అరటిపంటలో తెగుళ్లపై మందులు పిచికారి చేయడానికి రైతులు డ్రోన్‌ను ఉపయోగించారు.

డ్రోన్‌తో మందుల పిచికారీ

  యాడికి, అక్టోబరు 7: అరటిపంటలో తెగుళ్లపై మందులు పిచికారి చేయడానికి రైతులు డ్రోన్‌ను ఉపయోగించారు. మండలంలోని రాయలచెరువులో అరటిలో సిగటోక వైరస్‌ ఎక్కువగా ఉందని,  అరటి ఆకుల పైభాగంలో మందు పిచికారీ చేయాలంటే కష్టమని, అదే డ్రోన్‌ద్వారా అయితే సులువని రైతులు చెబుతున్నారు. ఎకరా అరటిపై మందు పిచికారి చేయడానికి రూ.500 నుంచి 600 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. యాడికి మండలంలో డ్రోన్‌లు ఎవరు తీసుకో లేదని పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన వ్యక్తి చెన్నై నుంచి డ్రోన్‌ను  కొనుగోలు చేశాడని, అతని ద్వారా డ్రోన్‌ను అద్దెకు తీసుకువ చ్చినట్లు అరటిరైతులు తెలిపారు. డ్రోన్‌కు ఉన్న ట్యాంక్‌లో ఒకసారి 11లీటర్ల నీరు, రసాయనం మాత్రమే పడుతుందని, బ్యాటరీ ద్వారా నడిచే ఈ డ్రోన్‌ ఎకరాలో మందు స్ర్పే చేయడానికి 15 నిమిషాల సమ యం మా త్రమే పడుతుందని రైతు తెలిపాడు. ఎక్కువ ఎకరా ల్లో అరటిసాగు చేసిన రైతులకు డ్రోన్‌ ఎంతో ఉపయోగకరమన్నారు


Updated Date - 2022-10-08T05:12:14+05:30 IST