AP: మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

ABN , First Publish Date - 2021-12-25T13:18:55+05:30 IST

జిల్లాలోని టెక్కలి భూలోకమాత వీధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కన్న కొడుకును చంపేశాడు.

AP: మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి భూలోకమాత వీధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కన్న కొడుకును హత్య చేశాడు. బిసాయి నాగరాజుపై  తండ్రి లవకుశ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలతో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-12-25T13:18:55+05:30 IST