గేమ్స్‌ ఆడొద్దన్నారని..

ABN , First Publish Date - 2021-10-18T05:54:11+05:30 IST

సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ వ్యసనంలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్న కుమారుడిని తండ్రి మందలించడంతో ఇంటి నుంచి పరారయ్యాడు.

గేమ్స్‌ ఆడొద్దన్నారని..

ఇంటి నుంచి పారిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి
సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 17: సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ వ్యసనంలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్న కుమారుడిని తండ్రి మందలించడంతో ఇంటి నుంచి పరారయ్యాడు.  కాకినాడ ఒకటో డివిజన్‌ రమణయ్యపేటకు చెందిన హజీబ్‌ భీముడు దంపతుల ఏకైక కుమారుడు  హజీబ్‌ సూర్యశ్రీ ఫణి ప్రశాంత్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ కారణంగా స్కూల్స్‌కు సెలవులు రావడం, ఇంటి పట్టునే ఉండటంతో కాలక్షేపం కోసం ప్రారంభించిన కంప్యూటర్‌ గేముల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్కూల్‌ తెరిచిన తర్వాత కూడా రోజంతా అదే పనిగా గేమ్స్‌ ఆడటాన్ని గమనించిన తండ్రి కుమారుడి చదువును గాడిలో పెట్టేందుకు గేమ్స్‌ ఆడొద్దని మందలించాడు.  దీంతో ప్రశాంత్‌ కోపంతో ఎవరికి చెప్పకుండా శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇంటి పరిసరాలు, స్నేహితులు, బంధువుల ఇంటి వద్ద గాలించినా కుమారుడు ఆచూకీ లభించకపోవడంతో శనివారం రాత్రి సర్పవరం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తండ్రి భీముడు హజీజ్‌ తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలు నమోదు చేసుకుని బాలుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు తీసుకున్నామని సర్పవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బి. రాజశేఖరరావు తెలిపారు.

Updated Date - 2021-10-18T05:54:11+05:30 IST