ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

Published: Wed, 29 Jun 2022 00:39:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

చేవెళ్ల/మొయినాబాద్‌ రూరల్‌/షాబాద్‌/ జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, మోడల్‌స్కూల్‌, రెసిడెన్షియల్‌ కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులు సత్తాచాటారు. చేవెళ్ల మండల కేంద్రంలో మోడల్‌స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 92మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా మొత్తం 63శాతం ప్రతిభ సాధించారు. అదేవిధంగా ఇంటర్‌ సెకండియర్‌లో 112మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 91మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 81శాతం పాసయ్యారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పావని బైపీసీలో 463మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచినట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ టేనావతి తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 243మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులతో 104మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 43శాతం ఫలితాలు సాదించారు. ఇందులో మధుసూదన్‌ ఎంపీసీలో మొదటి సంవత్సరంలో 447 మార్కులు సాధించాడు. బైపీసీలో 413, ఒకేషనల్‌లో యశ్వంత్‌ 488, ఓఏఎ్‌సలో సౌందర్య 484, కంప్యూటర్‌ సైన్స్‌లో పి.మౌనిక 468మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా సెకండియర్‌లో 189మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 114మంది పాసయ్యారు. 60.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో బి.పవన్‌ 881, సీఈసీలో సుల్తానా 801, కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.గణేష్‌ 964, ఓఏఎ్‌సలో ఎం.సంజయ్‌రాజ్‌ 942, సెరికల్చర్‌లో సోమ్ల 907మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా వివేకానంద జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ విభాగంలో హర్షిత 462, టి.విష్ణువర్థన్‌బాబు 462మార్కులు, సీఈసీలో డి.వైష్ణవి 488, సి.నవ్యశ్రీ 480 మార్కులు, ఎంఈసీలో ఎం.వృతి 490మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అనూష 988, ఏ.అనూష 987మార్కులు, బైసీపీలో అంకిత 957, జీవిత 955, సీఈసీలో బి.మయూర్‌ 957, ఎంఈసీలో జె.సింధూ 938మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. శ్రీచైతన్య కశాశాలలో బైపీసీలో భవ్యశ్రీ 461, ఎంఈసీలో మహీన్‌ 483, ఎం.సత్యప్రకాశ్‌ 478, సీఈసీలో స్నేహ 471, ఎం.శివప్రసాద్‌ 468 మార్కులు సాధించారు. సెకండియర్‌ ఎంపీసీలో జి. మహేశ్వరి 986, కె.వంశీ 973, బైపీసీలో అంజలికూమారి 982మార్కులు, ఎం.అనురాధ 951, ఎంఈసీలో అనూష 979, రామ్య 919, సీఈసీలో ఈ.వైష్ణవీ 855, శ్రావణి 851 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ శేఖర్‌ తెలిపారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండలంలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఫస్టియర్‌ విద్యార్థులు 96.8శాతం, సెకండియర్‌ విద్యార్థులు 98.6శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో చదువుతున్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఫస్టియర్‌ విద్యార్థిని నిత్యగౌడ్‌(ఎంపీసీ)లో 470మార్కులకు గానూ 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అదేవిధంగా మండల కేంద్రంలోని సిద్దార్థ కళాశాలలో ఫస్టియర్‌ చదువుతున్న పూజిత 462మార్కులు, సెకండియర్‌ చదువుతున్న ఇమ్రాన్‌ 938 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రశాంత్‌ నాయక్‌ 961, కిరణ్‌ 979మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా షాబాద్‌లో ఆదర్శ కళాశాలలో ఎంపీసీ విద్యార్థి హరిణి 961 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీవాచ్యా తెలిపారు. బీపీసీలో ఉదయ్‌భాను 883, సీఈసీలో ప్రియాంక 878, ఎంఈసీలో నందిని 752 మార్కులతో టాపర్లుగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా ఆమన్‌గల్‌ ఆదర్శ పాఠశాల నుంచి ఇంటర్‌ సెకండియర్‌ బీపీసీలో తేజస్విని 978, ఎంపీసీలో చందన 976 మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ రేణుక అభినందించారు. 

శంషాబాద్‌లో.. 

శంషాబాద్‌ రూరల్‌:  ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో పాల్మాకుల మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ సెకండియర్‌లో ఎంపీసీ చదువుతున్న పూజ 912, బైపీసీలో పావని 968, సీఈసీలో సానియా 887, ఎంఈసీలో సుజాత 805మార్కులు సాధించారు. అదేవిధంగా ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కె.దివ్య 429, సీఈసీలో మల్లేశ్వరీ 468, ఎంఈసీలో నందిని 451 మార్కులు సాధించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 68శాతం, ద్వితీయ సంవత్సరంలో 85శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ విష్ణుప్రియ తెలిపారు. 

కందుకూరులో.. 

కందుకూరు: మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బదిరుల జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 65మందికి గానూ 55మంది పాసయ్యారు. 85శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 81మంది విద్యార్థులకు గానూ 71మంది పాసై 88శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాలకు చెందిన జి.సాయిప్రియ ఎంపీహెచ్‌ డబ్ల్యూలో 470మార్కులు సాధించింది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 70శాతం, ద్వితీయ సంవత్సరంలో 80శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌.మానస ఎంపీసీ మొదటి సంవత్సరంలో 461మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో బి.శ్రీనాథ్‌ 912మార్కులు సాధించాడు. నేదునూరులోని ఆదర్శ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 62శాతం, ద్వితీయ సంవత్సరంలో 68శాతం మంది ఉత్తీర్ణులైయ్యారు. సెకండియర్‌ విద్యార్థులు ఎంపీసీలో ఝాన్సీ 976, కె.శివానంద్‌ 965మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు.

కేశంపేట కేజీబీవీలో 99శాతం ఉత్తీర్ణత

కేశంపేట: కేశంపేట కస్తూర్బా విద్యాలయంలోని ఇంటర్‌ విద్యార్థుల 99శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం సీఈసీలో 42మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 41మంది విద్యార్థులు పాసయ్యారు. అందులో శ్రీజ 456, హిమబిందు 444 మార్కులు సాధించారు. ప్యార మెడికల్‌లో 36మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 36మందికి పాసయ్యారు. 100శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 78మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 77మంది విద్యార్థులు పాసైనట్లు ఇన్‌చార్జి ఎంఈవో మనోహర్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ గౌసీయా బేగం తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో.. 

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలికల (నల్లకంచె) గురుకుల జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 78మంది బాలికలకుగానూ 71మంది పాసయ్యారు. 91ఉత్తీర్ణత శాతంగా ఉంది. అదేవిధంగా సెకండియర్‌లో 75మంది బాలికలకు గానూ 74మంది పాసయ్యారు. 98.6ఉత్తీర్ణతా శాతంగా ఉంది. బైపీసీ రెండో సంవత్సరంలో టి.హర్షిత 980మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు. ఎంపీసీ సెకండియర్‌లో కె.వీణ 977, ఫస్టియర్‌లో బైపీసీలో ఎం.ప్రతిమ, జి.ఝాన్సీరాణిలు 430, ఎంపీసీ ఫస్టియర్‌లో ఆర్‌.శ్రావ్య 463/470 మార్కులు సాధించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఫస్టియర్‌లో 69శాతం, సెకండియర్‌లో 91శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంఈసీ సెకండియర్‌లో పూడూరు అనిల్‌కుమార్‌రెడ్డి 957, సీసీసీ సెకండియర్‌లో ఇ.శివకుమార్‌ 949 మార్కులు సాధించారు. అదేవిధంగా కార్తికేయ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన ఎన్‌.పావని ఎంపీసీ ఫస్టియర్‌లో 466/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌ తెలిపారు. అదేవిధంగా యాచారం మండలంలోని గున్‌గల్‌ మోడల్‌స్కూల్‌కు చెందిన ఆర్‌.ప్రవీణ్‌ సెకండియర్‌లో 965/1000మార్కులు సాధించాడు. ఇదే కళాశాలలో 114మంది విద్యార్థులు పరీక్ష రాయగా 43శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో అశ్విని 442/470, బైపీసీలో శ్రేయ 431/440, ఎంఈసీలో రాకేష్‌ 480/500 మార్కులు సాధించారు. సీఈసీలో హరిరామకృష్ణ500కి గాను 454 మార్కులు సాదించారు. ఎంపీసీ సెకండియర్‌ విద్యార్థి ప్రవీణ్‌ 965మార్కులు సాధించాడు. బైపీసీ సెకండియర్‌లో గాయత్రి 865, సీఈసీలో మైత్రి 815, ఎంఈసీలో స్వాతిప్రియ 668మార్కులు సాధించారు. కాగాప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వేణుగోపాల్‌ బైపీసీలో 857, సీఈసీలో ఆశ్వ 847మార్కులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా అభినందనలు తెలిపారు.  అదేవిధంగా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి బొంగ్లూరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు సెకండియర్‌ ఎంపీసీలో ఎం.శ్రీజ 971, బైపీసీలో ఎం.దివ్యశ్రీ 852, ఎంఈసీలో మేఘన 701, సీఈసీలో ఎ.దీక్షిత 928మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా ఫస్టియర్‌ విద్యార్థులు డి.విశ్వాస్‌ ఎంపీసీలో 470 మార్కులకు గానూ 460, జి.అనూ 460 సాధించారు. బైపీసీలో జ్యోతి 393/440, ఎంఈసీలో ఏ.చరణ్‌ 401, సీఈసీలో ఆర్‌.భావన 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల సంచాలకులు ఉషారాణి, కళాశాల ప్రిన్సిపల్‌ లావణ్య అభినందించారు.  

ఆమనగల్లులో..

ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 40శాతం, ద్వితీయ సంవత్సరంలో 44శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 189విద్యార్థులకు గానూ 75, ద్వితీయ సంవత్సరంలో 105మందికి గానూ 46మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రన్సిపాల్‌ అనసూయ తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కె.నిఖిల్‌ కుమార్‌ 860, బైపీసీలో ఎస్‌.శ్రావణి 827, సీఈసీలో శివాని 761, ఎంపీసీలో హేమలత 801, బైపీసీలో జి.సంధ్య 721, సీఈసీలో కె.కీర్తి 714, ప్రథమ సంవత్సరంలో డి.తులసి 425, సింధూజ 421, స్నేహ 400, కార్తీక్‌ 397, మహేశ్‌ 471, మనీషా 400మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన జక్కు వెంకట్‌రెడ్డి కుమారుడు జక్కు సంతో్‌షరెడ్డికి ఎంపీసీలో 462/470 మార్కులు వచ్చాయి. 

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.