గ్రామాలు జ్ఞానకేంద్రాలుగా మారాలన్నదే స్వేరోస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-28T05:52:49+05:30 IST

గ్రామాలు జ్ఞానకేంద్రాలుగా మారాలన్నదే స్వేరోస్‌ లక్ష్యం

గ్రామాలు జ్ఞానకేంద్రాలుగా మారాలన్నదే స్వేరోస్‌ లక్ష్యం
మాట్లాడుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

  • గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ 

కులకచర్ల: గ్రామాలు జ్ఞానకేంద్రాలుగా మారాలన్నదే స్వేరోస్‌ లక్ష్యమని సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్వేరోస్‌ జ్ఞానయాత్ర ముగింపుసభ శనివారం రాత్రి కులకచర్ల మండలం కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పేదలందరికీ ఉన్నత విద్యను అందించే విధంగా చేయూతనందించేందుకే స్వేరోస్‌ ప నిచేస్తోందన్నారు. పిల్లల భవిష్యత్‌పై ప్రాథమిక స్థాయిలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. అసమానతల జాఢ్యం తీవ్రంగా ఉన్న రోజుల్లో అంబేద్కర్‌ అణగారిన వర్గాల కోసం ఎంతో కృషిచేశారని, చదువుకున్న ధైర్యంతోనే ఆయన పోరాటం చేశారని తెలిపారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు గుర్తింపు వచ్చిందన్నారు. అంబేద్కర్‌ పెట్టిన బిక్షతోనే తాను నేడు ఐపీఎస్‌ అధికారి స్థాయికి ఎదిగానని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహాన్‌రెడ్డి, ఎంపీపీ సత్త మ్మ, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, స్వేరోస్‌ ప్రతినిధులు శ్యామ్‌, విజయ్‌కుమార్‌, టి.అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:52:49+05:30 IST