స్వార్డ్‌ సంస్థ సేవలు అభినందనీయం

Jun 17 2021 @ 00:08AM
ఒంటరి మహిళలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న ఆశాలత

 సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆశాలత

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 16 : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు స్వార్డ్‌, ప్రేమ్‌ అజీమ్‌ ఫౌండేషన్లు చేయూతనందించడం అభినందనీయమని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత అన్నారు. జిల్లాలో 300 మంది ఒంటరి మహిళలను గుర్తించి మొదటి విడతగా బుధవారం సంగారెడ్డిలోని సఖి కేంద్రంలో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, శానిటైజర్‌, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సుజాతరాజ్‌, సంస్థ సభ్యులు రమణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: