స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-10T05:32:10+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు.

స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణఖేడ్‌ క్యాంపు కార్యాలయంలో వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

 నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌, మే 9: ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో ర్యాకల్‌ పలుగుతండాకు చెందిన సురే్‌షకు ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన ట్రాలీఆటోను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖేడ్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పరశురాం, జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్‌, మాజీ సర్పంచు నజీబ్‌, సేవాలాల్‌ సంఘం నాయకులు రమేష్‌ చౌహాన్‌, నాయకులు నర్సింహులు, చరణ్‌, అంజాగౌడ్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-10T05:32:10+05:30 IST