పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-26T06:30:07+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెస్‌ను తగ్గించాలని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ డిమాండ్‌ చేశారు.

పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ తగ్గించాలి
పాలకొల్లు పెట్రోలు బంకు వద్ద ధర్నా

పాలకొల్లు అర్బన్‌, మే 25: పెట్రోలు, డీజిల్‌ ధరలను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెస్‌ను తగ్గించాలని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి పెట్రోలు బంకు వద్ద బుధవారం ధర్నా చేశారు. అంగర మాట్లాడుతూ నిత్యా వసర ధరలు పెరగడానికి పెట్రో ఉత్పత్తుల ధరలు కారణమన్నారు. కేంద్రం తగ్గించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెస్‌ను తగ్గిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంఅన్నారు. టీడీపీ రాష్ట్రకార్యదర్శి పెచ్చెట్టి బాబు, కర్నేన గౌరునాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, కోడి విజయభా స్కర్‌, కడలి గోపాలరావు, ధనాని ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం టౌన్‌: పెట్రోల్‌పై వ్యాట్‌ ట్యాక్స్‌ తగ్గించాలంటూ టీడీపీ అధ్వర్యంలో పెట్రోల్‌ బంకు వద్ద అందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి నాయకులంతా ర్యాలీగా బంక్‌ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం పెట్రోల్‌పై తగ్గించిన ధరను జగన్‌ ప్రభుత్వం వ్యాట్‌ ట్యాక్స్‌ను తగ్గించకపోవడం దారుణమన్నారు. తక్షణం పెట్రోల్‌పై ట్యాక్స్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, పాలూరి బాబ్జి, కొప్పాడ రవి, కె.పద్మ, మౌలాలీ,  భాస్కర్‌, నాగబాబు, శ్రీనివాసు, రమేష్‌, హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:30:07+05:30 IST