AP: బస్సులోనే చంద్రబాబు బస

ABN , First Publish Date - 2021-10-30T15:27:06+05:30 IST

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగనుంది. కుప్పంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్ద బాబు బస్సులోనే బస చేశారు.

AP: బస్సులోనే చంద్రబాబు బస

చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగనుంది. రాత్రంతా ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్ద బాబు బస్సులోనే బస చేశారు. కుప్పంలో చంద్రబాబు  రెండవ రోజు పర్యటన కోసం పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి రోజు బహిరంగ సభలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పుట్టినరోజు చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పరిణామాల మేరకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఇవాళ ఆయన పర్యటనకు భారీగా పోలీసు భద్రతను పెంచింది. చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకుని, వినతులు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్దకు బాధిత ప్రజలు చేరుకున్నారు.

Updated Date - 2021-10-30T15:27:06+05:30 IST