కాఫీలకు బదులుగా టీలు తాగడమే మేలు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2022-03-08T18:04:02+05:30 IST

ఒంట్లో ఇసుమంత ఓపిక లేనట్టు, రోజంతా స్లో మోషన్‌లో సాగుతుందా? పనులను పక్కనపెట్టి నడుం వాల్చాలనిపిస్తోందా? అయితే అందుకు కారణాలను వెతికి, వాటిని సరిదిద్దుకోవాలి.

కాఫీలకు బదులుగా టీలు తాగడమే మేలు.. ఎందుకంటే?

ఆంధ్రజ్యోతి(08-03-2022)

ఒంట్లో ఇసుమంత ఓపిక లేనట్టు, రోజంతా స్లో మోషన్‌లో సాగుతుందా? పనులను పక్కనపెట్టి నడుం వాల్చాలనిపిస్తోందా?  అయితే అందుకు కారణాలను వెతికి, వాటిని సరిదిద్దుకోవాలి. 


థైరాయిడ్‌: థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగిస్తే, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆ గ్రంథి వేగం నెమ్మదిస్తే, మన శరీరం, మెదడు పనితీరులు కూడా నెమ్మదిస్తాయి. కాబట్టి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకుని లోపాలు సరిదిద్దుకోవాలి. 


ఐరన్‌ లోపం: ఐరన్‌ లోపంతో నీరసం ఆవరిస్తుంది. నిద్ర ముందచుకొస్తూ ఉంటుంది. శరీరం మొత్తానికీ ఆక్సిజన్‌ చేరవేసే ఎర్ర రక్తకణాలు తయారవుతూ ఉండాలంటే ఐరన్‌ పుష్కలంగా శరీరానికి అందుతూ ఉండాలి. ఐరన్‌ లోపంతో శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందక నిస్సత్తువగా మారుతుంది. కాబట్టి ఐరన్‌ లోపాన్ని సరిదిద్దే ఆహారం, సప్లిమెంట్లు తీసుకోవాలి. 


బి12 లోపం: ఎర్ర రక్తకణాల తయారీకి ఇనుము, బి12 తోడ్పడతాయి. నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేయాలన్నా బి12 విటమిన్‌ సరిపడా ఉండాలి. నీరసం, పాదాల్లో, చేతుల్లో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి తగ్గడం మొదలైన లక్షణాలు తగ్గాలంటే బి12 విటమిన్‌ ఉండే గుడ్లు, మాంసం మొదలైన పదార్థాలు ఎక్కువగా తినాలి. 


కాఫీ వద్దు: నీరసాన్ని వదిలించడం కోసం కొంత మంది కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే కొందరి శరీరాల్లో కెఫీన్‌ గంటల తరబడి ఉండిపోతుంది. ఇది అడ్రినల్‌ గ్రంథుల మీద ఒత్తిడిని పెంచి, నీరసాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి కాఫీలు తగ్గించి, ఎంతటి నిస్సత్తువ కలుగుతుందో గమనించాలి. కాఫీలకు బదులుగా టీలను ఎంచుకోవాలి.  

Updated Date - 2022-03-08T18:04:02+05:30 IST