అంగన్‌వాడీలు, ఆశాల సేవలు ఎనలేనివి

ABN , First Publish Date - 2022-08-08T06:11:48+05:30 IST

గ్రామాల్లో అంగన్‌వాడీటీచర్లు, ఆశా వర్క ర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.

అంగన్‌వాడీలు, ఆశాల సేవలు ఎనలేనివి

రామచంద్రపురం, ఆగస్టు  7: గ్రామాల్లో అంగన్‌వాడీటీచర్లు, ఆశా వర్క ర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌వీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గంలోని మూడు మండలాల అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను మంత్రి సత్క రించి శ్రావణమాసం కానుకగా పట్టు చీర, పసుపు, కుంకుమ తాంబూలం అందజేశారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి, వాసంశెట్టి శ్రీనివాస శ్యామ్‌కుమార్‌, ఇంత సంతోషం, దొమ్మలపాటి సత్యనారాయణ,  ఎంపీపీ అంబటి భవాని, వైస్‌ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి,  శాఖా బాబి, టేకుమూడి సత్యనారాయణ, వైసీపీ పట్టణ కన్వీనర్‌ గాధంశెట్టి శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:11:48+05:30 IST