ప్లాస్టిక్‌ నిషేధం మరింత కఠినం

ABN , First Publish Date - 2022-06-27T05:55:37+05:30 IST

పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఉన్న నిషేధాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ప్లాస్టిక్‌ మహమ్మారి వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.

ప్లాస్టిక్‌ నిషేధం మరింత కఠినం

నిషేధిత జాబితాలోకి ప్లాస్టిక్‌ స్పూన్లు

జూలై 1 నుంచి అమలుకు సిద్ధం

 

మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 26: పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఉన్న నిషేధాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ప్లాస్టిక్‌ మహమ్మారి వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో 77 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. అయితే ప్లాస్టిక్‌ వస్తువులను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ ముడి సరుకులు, ఒకసారి వాడి పాడేసే వస్తువులను తయారు చేసే సంస్థలకు సరఫరా చేయవద్దని టెట్రో కెమికల్‌ సంస్థలను కేంద్రం ఆదేశించింది. దీంతో ఇకపై కేవలం నిషేధిత ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులతో పాటు మరికొన్ని సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ వస్తులను వినియోగించినా, విక్రయించిన ప్రభుత్వం జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకోనున్నది. మున్సిపాలిటీలలో ఆయా వ్యాపార సంస్థలకు లైసెన్సులను జారీ చేసే సమయంలో సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని షరతులు విధించారు. ఎవరైనా అతిక్రమిస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీమంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 1 నుంచి అన్ని మున్సిపాలిటీల్లోని పట్టణాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈలోగా ఆయా వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంటుంది. 


నిషేధిత వస్తువులు ఇవే

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఇయర్‌ బర్డ్స్‌, బుడగలు, ఐస్‌క్రీంలో వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు 100 మైక్రాలలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే బ్యానర్లు సామగ్రి వంటివి నిషేధించిం ది. ఇంత కాలం ప్లాస్టిక్‌ బ్యాగులపైనే నిషేధం ఉన్నప్పటికీ కొన్నిప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యంతో క్యారీ బ్యాగుల వినియోగం ఇంకా కొనసాగుతుంది. కప్పు లు, ప్లాస్టిక్‌ చెంచాలు, బ్యానర్లపై నిషేధం లేకపోవడంతో యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు, గ్లాసులు, కప్పులు, ప్లేట్ల వినియోగం జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించినప్పుడే నాలుగు, ఐదు రోజు లు మున్సిపాలిటీల్లో అధికారుల దాడి నిర్వహించి తూతూమంతంగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప చిత్తశుద్ధి చూపించడం లేదు. ఫలితంగా ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. అంతేకాకుండా సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ మురుగుకాలువల్లో అడ్డు పడుతూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పట్టణప్రగతిలో సైతం స్పూన్లు, ప్లేట్లు లాంటి తదితర ప్లాస్టిక్‌ వస్తువులు నిషేదిస్తున్నట్లు సైతం ప్రచారం చేపట్టారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయనున్నారు. మున్సిపాలిటీలలో నిషేధిక ప్లాస్టిక్‌ వస్తువులపై అధికారుల దృష్టి సారించి పర్యావరణ పరిరక్షణక తోడ్పాటునందించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T05:55:37+05:30 IST