వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి

ABN , First Publish Date - 2021-03-03T07:19:28+05:30 IST

మండలంలోని కదరంపల్లి స మీపాన మంగళవారం వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుంది. ఆమార్గంలో వెళుతున్న స్థానికులు ఎలుగు బంటి అరుపులు విని గుర్తించి అటవీశాఖ అధికారుల కు సమాచారం చేరవేశారు.

వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి
ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి

కుందుర్పి, మార్చి 2: మండలంలోని కదరంపల్లి స మీపాన మంగళవారం వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుంది. ఆమార్గంలో వెళుతున్న స్థానికులు ఎలుగు బంటి అరుపులు విని గుర్తించి అటవీశాఖ అధికారుల కు సమాచారం చేరవేశారు. సెక్షన ఆఫీసర్‌ నాగేనాయ క్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతికష్టంమీద ఎలుగుబంటిని ఉచ్చు నుండి విడిపించడంతో ప్రాణాలతో బయటపడి అటవీ మార్గంలో చేరుకుంది. కాగా ఈప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుండ డంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతుల కు గురవుతున్నారు. వన్యప్రాణాల నుంచి రైతులు, గ్రా మస్థులకు ఇబ్బందులులేకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

Updated Date - 2021-03-03T07:19:28+05:30 IST