డ్రగ్‌ మహమ్మారిని తరిమికొట్టాలి

ABN , First Publish Date - 2022-06-28T04:56:14+05:30 IST

డ్రగ్‌ మహమ్మారిని తరిమికొట్టాలి

డ్రగ్‌ మహమ్మారిని తరిమికొట్టాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న గోవర్దన్‌రెడ్డి


  • రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అఽథారిటీ సభ్యుడు గోవర్దన్‌రెడ్డి

ఘట్‌కేసర్‌రూరల్‌, జూన్‌27 : డ్రగ్‌ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అఽథారిటీ సభ్యుడు, రంగారెడ్డికోర్టు న్యాయమూర్తి ఎస్‌. గోవర్దన్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. అంకుశాపూర్‌లోని ఏస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ధర్మ స్వచ్ఛంద సేవా సంస్థ నేతృత్వంలో సోమవారం అంతర్జాతీయ డ్రగ్‌ వ్యతిరేక దినం కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్‌ దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు మత్తుపదార్థాల బారినపడొద్దని, వాటి జోలికి వెళ్లి తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. డ్రగ్‌ ఒక్కసారి అలవాటు పడితే జీవితాన్నే నాశనం  చేస్తుందని తెలిపారు. 

డ్రగ్‌ కేసులో పట్టుబడితే ఉద్యోగాలు లభించవు : సీపీ మహేష్‌ భగవత్‌ 

విద్యార్థులు డ్రగ్స్‌ కేసులో పట్టుపడితే ఉద్యోగాలు లభించవని తెలిపారు. చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యురాలు శ్రీదేవి, ఎస్‌ ఇంజనీరింగు కళాశాల కార్యదర్శి డాక్టర్‌ వై. వీ గోపాలకృష్ణమూర్తి, సంయుక్తకార్యదర్శి ఎం. పద్మావతి, ప్రిన్సిపాల్‌ బీఎల్‌ రాజు, ధర్మసేవా సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌రావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:56:14+05:30 IST