Advertisement

ఈతవనం దగ్ధం

Mar 6 2021 @ 00:08AM
ఎగసిపడుతున్న మంటలు

కీసర రూరల్‌ : అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈత వనం దగ్ధమైన ఘటన శుక్రవారం కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధి నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో జరిగింది. రాంపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో రామంతాపూర్‌, రాంపల్లి గీత కార్మికులకు కేటాయించిన 5ఎకరాల స్థలంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 2003 నుంచి ఈత, ఖర్జూరం, తాటి, జీలుగు మొక్కల్ని పెంచుతున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఈతవనంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి చెట్లు కాలిపోతుండటంతో స్థానికులు చెర్లపల్లి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేసారు. అప్పటికే దాదాపు 800 మొక్కలు కాలిపోయాయి. అందులో కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నవి. కాగా ఈత వనం పక్కనే ఉన్న రేల్వే ట్రాక్‌ వైపు నుంచి మంటలు వ్యాప్తి చెందినట్లు వాచ్‌మెన్‌ వెల్లడించారు.

Follow Us on:
Advertisement