బహుజన రాజ్యస్థాపనకు ఏకం కావాలి

ABN , First Publish Date - 2021-10-17T04:37:02+05:30 IST

బహుజన రాజ్య స్థాపనకు మాల, మాదిగ ఉప కులాలు ఏకమై ముందుకు సాగాలని మాల, మాదిగ ఉప కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి అన్నారు.

బహుజన రాజ్యస్థాపనకు ఏకం కావాలి
చిన్నకోడూరులో మాల, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక మేనిఫెస్టోను ఆవిష్కరిస్తున్న నాయకులు

చిన్నకోడూరు, అక్టోబరు 16: బహుజన రాజ్య స్థాపనకు మాల, మాదిగ ఉప కులాలు ఏకమై ముందుకు సాగాలని మాల, మాదిగ ఉప కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా మాల, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక మేనిఫెస్టో పుస్తకానికి జమ్మి చెట్టు వద్ద పూజ చేసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుడిమల్ల సత్తయ్య, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు కర్రె రవీందర్‌, కనకయ్య, బాలయ్య, బాబు, గణేష్‌, నాగరాజు, మహేష్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-17T04:37:02+05:30 IST