అధికారంతో వైసీపీ నాయకుల కళ్లు మూసుకుపోయాయ్‌

ABN , First Publish Date - 2022-06-28T06:26:49+05:30 IST

అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్లు మూసుకుపోయాయని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతు న్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.

అధికారంతో వైసీపీ నాయకుల కళ్లు మూసుకుపోయాయ్‌
ధర్నాకు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం 

‘చలో రొళ్ల’ నిరసనలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల


రొళ్ళ, జూన 27: అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్లు మూసుకుపోయాయని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతు న్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. మండలంలోని హునిసేకుంట గ్రామ టీడీపీ మహిళా కార్యకర్త రత్నమ్మ చిల్లర దుకాణాన్ని దౌర్జన్యంగా కూల్చివే యడాన్ని నిరసిస్తూ, టీడీపీ సోమవారం చలో రొళ్ల నిరసనకు పిలు పునివ్వడంతో వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. మండలకేం ద్రంలో బైఠాయించి, అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించారు. నా యకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి బాధితులకు బాసట గా నిలిచారు. ఈసందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ వైసీపీకి చరమగీతం పాడే రోజుల దగ్గరపడ్డాయన్నారు. రత్నమ్మ జీవనాధా రం కోసం ప్రభుత్వ ఖాళీ స్థలంలో దుకాణం పెట్టుకుందన్నారు. కేవ లం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు అన్న అక్కసుతో దుకాణాన్ని యంత్రాల సాయంతో నేలమట్టం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన.. నేటి వరకు అదేపంథాను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కూల్చడం, వేధించడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులకు ది గుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఒక అడుగు ముందుకేసి, నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వే ధిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఏక ప క్షంగా దుకాణాన్ని కూల్చారన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలక డం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. వైసీపీ దాడులను స హించమని, టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భ రోసా ఇచ్చారు. చలో రొళ్ల నిరసనగా భారీగా తెలుగు తమ్ముళ్లు రా వడంతో మండలకేంద్రం అట్టుడికింది. ప్రధాన రహదారిని దిబ్బం ధించారు. 


 అధికారులు నిరసనకారుల వద్దకు వచ్చి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా బాధితురాలు రత్నమ్మను అదుకోవడానికి  విరాళాలు అందజేశారు. నిరసనలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివా్‌సమూర్తి, కన్వీనర్‌ దాసిరెడ్డి, అగళి టీడీపీ జడ్పీటీసీ సభ్యులు ఉమేష్‌, నాయకులు గు రుమూర్తి, మద్దనకుంటప్ప, శివరుద్రప్ప, నరసింహమూర్తి, నాగరా జు, అధికార ప్రతినిధి సురేష్‌, రామక్రిష్ణ, ఈరన్న, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-06-28T06:26:49+05:30 IST