కాబోయే సీఎం మీరే సార్..!
ABN , First Publish Date - 2022-05-21T06:12:50+05:30 IST
బాబు సార్... కాబోయే సీఎం మీరేనంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఓఫంక్షన హాల్లో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య అతిఽథిగా హాజరై వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశా నిర్దేశం చేశారు.
అనంతపురం అర్బన మే 20: బాబు సార్... కాబోయే సీఎం మీరేనంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఓఫంక్షన హాల్లో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య అతిఽథిగా హాజరై వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు వేదిక మీదకు రాగానే బాబు సీఎం... సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయన్ను చూసేందుకు పలువురు కార్యకర్తలు ఆసక్తి చూపారు. మరికొందరు జై బాబు.. జై జై బాబు అంటూ బాబుకు జేజేలు కొట్టారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలంతా ఉత్సాహంతో కనిపించారు. సమావేశం ముగిసిన తర్వాత పలువురు కార్యకర్తలు చంద్రబాబును సత్కరించడంతో పాటు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.