కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-17T03:58:58+05:30 IST

‘కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది. వైరస్‌ బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోంది’ అని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. కరోనా బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
వినతిపత్రం అందిస్తున్న కూన రవికుమార్‌




- బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

- శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

(ఆమదాలవలస రూరల్‌, జూన్‌ 16)

‘కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది. వైరస్‌ బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోంది’ అని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. కరోనా బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాలంటూ రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా ఆమదాలవలసలోని తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ  రామకృష్ణకు కూన రవికుమార్‌ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం  ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఆక్సిజన్‌ అందక చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు, కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వల్ల కొవిడ్‌ బారిన పడి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చంద్రన్న బీమా ఉంటే కొవిడ్‌తో మృతిచెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందేదని తెలిపారు. కర్ఫ్యూ వల్ల ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి కుటుంబాలకు, బియ్యం కార్డుదారులకు, ప్రైవేటు ఉపాధ్యాయులు, చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం ప్రకటించిన  సాయం అందజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరి..  వర్కింగ్‌ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లగా గుర్తించి, రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆనందయ్య మందుకు కావల్సిన ముడిసరుకులను అందించాలని, కొవిడ్‌ చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యలు దౌర్జన్యాలను అరికట్టాలని కోరారు. మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ఆసుపత్రులకు కావల్సిన మందులు, ఆక్సిజన్‌ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు.   కార్యక్రమంలో టీడీపీ నాయకులు  బోర గోవిందరావు, మొదలవలస రమేష్‌, తమ్మినేని విద్యాసాగర్‌, తమ్మినేని అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.





Updated Date - 2021-06-17T03:58:58+05:30 IST