ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-05-16T05:13:50+05:30 IST

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూత

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూత
క్రీడాకారులకు బహుమతి అందజేస్తున్న సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌

  • టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌ యాదవ్‌ 


తలకొండపల్లి, మే 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు చేయూతనందించి  ప్రోత్సహిస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ హాజరై విజేత టీమ్‌కు ప్రథమ బహుమతి రూ.10,116లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలతో పాటు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు, యువతలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు ఉపకరిస్తాయని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్‌గౌడ్‌, రవి, యాదయ్య, శేఖర్‌, విజయ్‌యాదవ్‌, బాల్‌రాజ్‌, శివ, శ్రీకాంత్‌, సాయి, గణేశ్‌, విష్ణు, రాజు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-16T05:13:50+05:30 IST