ఐడీఏ-తీగాపూర్‌ రహదారిని బీటీగా మార్చాలి

ABN , First Publish Date - 2020-07-05T10:20:47+05:30 IST

పారిశ్రామికవాడ పాత జాతీయ రహదారి నుంచి తీగాపూర్‌ వరకు గోతులమయంగా ఉన్న రహదారిని వెంటనే బీటీ రహదారిగా మార్చేందుకు పారిశ్రామిక

ఐడీఏ-తీగాపూర్‌ రహదారిని బీటీగా మార్చాలి

కొత్తూర్‌: పారిశ్రామికవాడ పాత జాతీయ రహదారి నుంచి తీగాపూర్‌ వరకు గోతులమయంగా ఉన్న రహదారిని వెంటనే బీటీ రహదారిగా మార్చేందుకు పారిశ్రామిక వేత్తలు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీటీసీ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకల వల్లే రహదారి గోతులమయంగా మారిందన్నారు.


ధర్నాలో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌శ్రీధర్‌  ఘటనా స్థలానికి చేరుకుని మూడురోజుల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌రెడ్డి, రమేష్‌, సాయిలుయాదవ్‌, విజయ్‌పాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:20:47+05:30 IST