అర్థంతరంగా ముగిసిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-07-01T06:30:37+05:30 IST

అర్థంతరంగా ముగిసిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

అర్థంతరంగా ముగిసిన మునిసిపల్‌  కౌన్సిల్‌ సమావేశం


తాండూరు, జూన్‌ 30 : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అధ్యక్షతన గురువారం ప్రారంభమైన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ముందుగా ఎజెండాలో ఐదు అంశాలు ప్రకటించగా.. అందులో నూపుర్‌శర్మపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం కౌన్సిలర్‌ చేసిన ప్రతిపాదననకు బీజేపీ కౌన్సిలర్లు  అడ్డుతగిలారు. ఆ అంశం ఎజెండాలోకి తీసుకురావడంపై బీజేపీ కౌన్సిలర్లు  వాదనకు దిగారు. దీంతో సమావేశం గందరగోళానికి దారితీయడంతో వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ స్వప్న ప్రకటించి కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటకు వెల్లిపోయారు. 

Updated Date - 2022-07-01T06:30:37+05:30 IST