కొత్తూర్‌ పురపాలక బరిలో 47మంది అభ్యర్థులు

ABN , First Publish Date - 2021-04-23T05:02:24+05:30 IST

కొత్తూర్‌ పురపాలక బరిలో 47మంది అభ్యర్థులు

కొత్తూర్‌ పురపాలక బరిలో 47మంది అభ్యర్థులు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంలు అందజేస్తున్న మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  •  అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసిన పార్టీల నాయకులు 
  • నేటి నుంచి ప్రచారం షురూ 

కొత్తూర్‌: పురపాలిక(కొత్తూర్‌) ఎన్నికల బరిలో 47మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. పురపాలికలోని 12వార్డులకుగాను 71మంది నామినేషన్లు వేయగా, ఉపసంహరణల ఆనంతరం 47మంది అభ్యర్థులు మిగిలారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లు బీ ఫాంలు అందజేశారు. డీసీసీ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ బీ ఫాంలను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌ అభ్యర్థులకు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆ పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేశారు. 

  • పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు

1వ వార్డు కుమ్మరి పార్వతమ్మ(టీఆర్‌ఎస్‌), పి. మాధవి(కాంగ్రెస్‌) మైలారం భారతమ్మ(బీజేపీ), బండారి సువర్ణ(స్వతంత్ర), 2వ వార్డు చింతకింది చంద్రకళారాజేందర్‌గౌడ్‌(టీఆర్‌ఎస్‌), వన్నాడ శివశంకర్‌(కాంగ్రెస్‌), అమడపురం నర్సింహాగౌడ్‌(బీజేపీ), 3వ వార్డు కోస్గి శ్రీనివా్‌స(టీఆర్‌ఎస్‌), వసుపుల మహేందర్‌(కాంగ్రెస్‌), కోస్గి మల్లే్‌ష(బీజేపీ), బేరి శ్రీనివాస్‌(బీజేపీ రేబల్‌), 4వ వార్డు పి. గోవింద్‌నాయక్‌(టీఆర్‌ఎస్‌), పి. సోమ్లనాయక్‌(కాంగ్రెస్‌), జగదీశ్వరీ(బీజేపీ), 5వ వార్డు హైమావతి(టీఆర్‌ఎస్‌), జె. అనితాశ్రీనివా్‌సగౌడ్‌(కాంగ్రెస్‌), బి. శ్వేత(బీజేపీ), 6వ వార్డు బానవత్‌ సరస్వతీవెంకటే్‌ష(టీఆర్‌ఎస్‌), వి. హేమ(కాంగ్రెస్‌), బి. శ్రీవిద్య(బీజేపీ), 7వ వార్డు కమ్మరి జయమ్మజనార్ధన్‌చారి(టీఆర్‌ఎస్‌), కమ్మరి ఐమావతి(కాంగ్రెస్‌), కె. మమత(బీజేపీ), కె. సునీత(స్వతంత్ర), 8వ వార్డు బి. లావణ్యదేవేందర్‌యాదవ్‌(టీఆర్‌ఎస్‌), మాసుల లావణ్య(కాంగ్రెస్‌), ఎర్రవల్లి స్వాతి(బీజేపీ), మంగలి స్వాతి, సామల నిర్మల(స్వతంత్రులు), 9వ వార్డు బి. గోవింద్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), మాదారం నర్సింహాగౌడ్‌(కాంగ్రెస్‌), ఎర్రవల్లి నాగరాజుచారి(బీజేపీ), 10వ వార్డు జె. కరుణాసుదర్శన్‌గౌడ్‌(టీఆర్‌ఎస్‌), కె. సుమలత(కాంగ్రెస్‌), పిట్టల శేఖర్‌గౌడ్‌(బీజేపీ), 11వ వార్డు బ్యాగరీ ప్రసన్నలత(టీఆర్‌ఎస్‌), కర్రొళ్ల పెంటమ్మ(కాంగ్రెస్‌), తుప్పర మంజుల(బీజేపీ) జెనిగె సుజాత(టీఆర్‌ఎస్‌ రెబల్‌), జోగు లక్ష్మి(టీఆర్‌ఎస్‌ రెబల్‌), జంగగళ్ల ఇందిర, జంగగళ్ల పద్మమ్మ(స్వతంత్రులు), 12వ వార్డు డోలీ రవిందర్‌(టీఆర్‌ఎస్‌), ప్రవీణ్‌కుమార్‌(కాంగ్రెస్‌), ఎం. మహే్‌ష(బీజేపీ), ఈ. రమే్‌ష(టీఆర్‌ఎస్‌ రెబల్‌), కుమ్మరి శ్రీనుకుమార్‌(స్వతంత్ర) పోటీలో ఉన్నారు.

Updated Date - 2021-04-23T05:02:24+05:30 IST