దళిత యువకుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి: తెలుగు యువత

ABN , First Publish Date - 2022-05-23T07:01:34+05:30 IST

కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలుగు యువత నాయకులు డిమాండ్‌ చేశారు.

దళిత యువకుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి: తెలుగు యువత
నిరసన తెలుపుతున్న తెలుగు యువత, టీఎనఎస్‌ఎఫ్‌, ఎస్సీ సెల్‌ నాయకులు

హిందూపురం టౌన, మే 22: కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలుగు యువత నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆం దోళన వ్యక్తం చేశారు. రోజూ రాష్ట్రంలో హత్యలు, వైసీపీ నాయకుల బెదిరింపులతో ఆ త్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూఅదుపు లేదన్నారు. ప్రజాస్వామ్యం మంటగలుస్తోందని, పులివెందుల రాజ్యం రాష్ట్రంలో విస్తరించిందని విమర్శించారు. కాకినాడ ఘటనలో బాధ్యులైన ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరె్‌స్ట చేయాలని డి మాండ్‌ చేశారు. కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సిద్దు, అంజి, స తీష్‌, మహేష్‌, శ్రీనివాసరెడ్డి, విజయ్‌, హరి, ఇందాద్‌ పాల్గొన్నారు. 


ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి 

కాకినాడలో కారుడ్రైవర్‌ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హ త్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వ చ్చాక దళితులపై అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని విమర్శించారు. డ్రైవర్‌ హత్య కేసుపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ  వెళ్లిన సందర్భంగా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుపై పోలీసు లు దురుసుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. హత్యచేసిన వా రిని అరె్‌స్ట చేయకుండా, వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై లాఠీచార్జీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆఖరికి మృతుని భార్య న్యాయం కోసం పోరాడితే ఆమెను చిత్రహింసలకు గురిచేసి పోలీ్‌సస్టేషనకు తరలించడంలో ప్రభుత్వ వైఖరి స్ప ష్టమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేంతవరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటు చేస్తామని నాయకులు ఈ సందర్భం గా హెచ్చరించారు. నిరసనలో ఎస్సీసెల్‌ అధ్యక్షుడు సతీ్‌షకుమార్‌, నాయకులు రమణ, గంగాధర్‌, ఆనంద్‌, అభి, అమాన, యుగంధర్‌, విజయ్‌, పవన, షెక్షా, హరి, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T07:01:34+05:30 IST