మూడేళ్లుగా ‘తొలకరి’ లేదు

ABN , First Publish Date - 2021-07-27T05:37:38+05:30 IST

మూడేళ్ళుగా తామంతా తొలకరి వరిపంట వేసిన పాపాన పోలేదని, ఏటా ఆ కాలంలో పొలాలు మునిగి పోతున్నాయంటూ కడియపుసావరం, కడియం గ్రామాల రైతులు మునిగిపోయిన పంట పొలాల్లో సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు.

మూడేళ్లుగా ‘తొలకరి’ లేదు

కడియం, జూలై 26: మూడేళ్ళుగా తామంతా తొలకరి వరిపంట వేసిన పాపాన  పోలేదని, ఏటా ఆ కాలంలో పొలాలు మునిగి పోతున్నాయంటూ కడియపుసావరం, కడియం గ్రామాల రైతులు మునిగిపోయిన పంట పొలాల్లో సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. సర్పంచ్‌ చెక్కపల్లి మురళీకృష్ణ, ఉపస ర్పంచ్‌ చెన్నా రాము, బీజెపీ నాయకులు ఆకుల శ్రీధర్‌, సొసైటీ మాజీ డైరెక్టర్‌ చెక్కపల్లి పుల్లారావు తదితరులతో పాటు రైతులు ఆందోళన నిర్వహించారు. కడియం ప్రాంతం నుంచి వచ్చే మురికి నీరుతోపాటు వర్షం నీరు బయటకు పోయే మార్గం లేక ఏటా తొలకరి సమయంలో 150 యకరాల భూమి పూర్తిగా మునిగిపోతుందన్నారు. ఎక్కువ మంది కౌలురైతులు ఉన్నారని, భూ యజమానులకు రెండు పంటలకు శిస్తు ఇస్తున్నారని, పంట మాత్రం ఒకటేనని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాలువలను కొందరు మూసేయడంతో నీరు పోయే మార్గం లేదని అన్నారు. అనంతరం తహశీల్దారు జి.భీమారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు చెక్కపల్లి పుల్లారావు, వరగోగుల రుద్ర య్య, అవజాల బాబూరావు, తంబాబత్తుల విజయ్‌, కుప్పాల బేబీ, జువ్వల దొరబాబు, గావు రామాంజనేయులు, కామిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:37:38+05:30 IST