రోజూ ఈ జ్యూస్ తాగితే రోగాలను తరిమికొట్టవచ్చు..

Published: Mon, 01 Nov 2021 12:52:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోజూ ఈ జ్యూస్ తాగితే రోగాలను తరిమికొట్టవచ్చు..

ఆంధ్రజ్యోతి(1-11-2021)

కావలసినవి: తులసి ఆకులు - కొన్ని, లవంగాలు - ఐదు, దంచిన అల్లం - ఒక టీస్పూన్‌, గిలోయ్‌ జ్యూస్‌ (తిప్పతీగ) - ఒక కప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, బ్లాక్‌సాల్ట్‌ - తగినంత.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్‌ తీసుకుని ఒక కప్పు గిలోయ్‌ జ్యూస్‌లో కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని సేవించాలి.


ప్రయోజనాలు: తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. టాక్సిన్స్‌ తొలగిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. కాలేయ జబ్బులు రాకుండా కాపాడు తుంది. మూత్రసంబంధ వ్యాధులు దరిచేరవు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.