వెబ్సైట్లో పాలకమండలి తీర్మానాల జీవోపై వెనక్కి తగ్గిన TTD
ABN , First Publish Date - 2022-02-04T14:19:46+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో పాలకమండలి తీర్మానాల జీవోలు పెట్టని అంశంలో టీటీడీ వెనక్కి తగ్గింది.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో పాలకమండలి తీర్మానాల జీవోలు పెట్టని అంశంలో టీటీడీ వెనక్కి తగ్గింది. ప్రభుత్వం వల్లే ఏడాది కాలంగా పాలకమండలి తీర్మానాలను టీటీడీ గోప్యంగా ఉంచింది. మాజీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఇచ్చిన లీగల్ నోటీసులతో జీవోలు పెట్టే అంశంపై టీటీడీ నిర్ణయం మార్చుకుంది. ఏడాది కాలంగా పెట్టని పాలకమండలి తీర్మానాలను వెబ్సైట్లో ఉంచింది.