ABN Andhrajyothy: తిరుపతిలో వైసీపీ దొంగఓట్లు.. బయట పెట్టిన ఏబీఎన్

ABN , First Publish Date - 2022-07-20T19:38:23+05:30 IST

దొంగ ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడంలో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఆరితేరిపోయింది.

ABN Andhrajyothy: తిరుపతిలో వైసీపీ దొంగఓట్లు.. బయట పెట్టిన ఏబీఎన్

తిరుపతి (Tirupathi): దొంగ ఓటర్లతో ఎన్నికలు (Elections) నిర్వహించడంలో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆరితేరిపోయింది. తిరుపతిలో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యపాలైంది. తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ (Tirupati Co Operative Bank) ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారు. ఈ ఘటనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) బయటపెట్టింది. అభ్యర్థులను పోలింగ్ బూత్ (Polling booth) నుంచి తరిమేసిన పోలీసులు.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారు. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి రామూర్తి (Ramurthy) సహా పలువురిని అరెస్టు చేశారు. టీడీపీ నేతలపై తప్పుడు అట్రాసిటీ కేసులు (Atrocity cases) నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Sugunamma) సహా టీడీపీ కీలక నేతలను గృహనిర్బంధం చేశారు.


బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి.. పబ్లిక్ పార్కులో టిఫిన్ పెట్టి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. వైసీపీకి చెందిన వారు ఆటోలో కూర్చుని దొంగ కార్డులు తయారు చేసి ఇస్తున్నారు. పోలింగ్ బూత్ నుంచి రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఈ తతంగం నడుపుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడానికి ఈ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.

Updated Date - 2022-07-20T19:38:23+05:30 IST