సముద్ర కెరటాల తాకిడికి మత్స్యకారుడు మృతి

ABN , First Publish Date - 2020-11-27T05:06:07+05:30 IST

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన కారి సందెయ్య (65) గురువారం సముద్ర కెరటాల తాకిడికి గురై మృతి చెందాడు. సముద్రపు ఒడ్డున గేలం తాడుతో చేపలు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు.

సముద్ర కెరటాల తాకిడికి   మత్స్యకారుడు మృతి
సందెయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఎచ్చెర్ల, నవంబరు 26: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన కారి సందెయ్య (65) గురువారం సముద్ర కెరటాల తాకిడికి గురై మృతి చెందాడు. సముద్రపు ఒడ్డున గేలం తాడుతో చేపలు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న తోటి మత్స్యకారులు ఆయనను కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.రాజేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం నగరంలోని సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సీతమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సందెయ్య ఆకస్మికంగా మృతిచెందడంతో బోరున విలపిస్తున్నారు. 


Updated Date - 2020-11-27T05:06:07+05:30 IST