జాడలేని ఆక్సీమీటర్లు!

ABN , First Publish Date - 2021-05-07T05:09:53+05:30 IST

ఆక్సిజన్‌ సకాలంలో అందక చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణయిన తర్వాత ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌ రేటు పరీక్షించుకోవడం తప్పనిసరి. సుమారు 94 శాతం కంటే తక్కువస్థాయిలో ఆక్సిజన్‌ ఉంటే తీవ్రత అధికంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. అందుకే కరోనా తొలిదశలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏఎన్‌ఎంలకు పల్స్‌ ఆక్సీమీటర్లు పంపిణీ చేశారు. 2000 మందికి వీటిని అందించారు. ప్రస్తుతం రెండో దశ ఉధృతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ మీటర్ల ఆచూకీ లేకుండా పోయింది.

జాడలేని ఆక్సీమీటర్లు!

కానరాని వైద్య పరీక్షలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కబళిస్తోంది. ఈ పరిస్థితుల్లో యంత్రాంగం పటిష్ట చర్యలకు ఉపక్రమించాలి. కానీ మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌లో వెనుకబాటు... బాధితులకు శాపంగా మారుతోంది. ఆక్సిజన్‌ సకాలంలో అందక చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణయిన తర్వాత ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌ రేటు పరీక్షించుకోవడం తప్పనిసరి. సుమారు 94 శాతం కంటే తక్కువస్థాయిలో ఆక్సిజన్‌ ఉంటే తీవ్రత అధికంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. అందుకే కరోనా తొలిదశలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏఎన్‌ఎంలకు పల్స్‌ ఆక్సీమీటర్లు పంపిణీ చేశారు. 2000 మందికి వీటిని అందించారు. ప్రస్తుతం రెండో దశ ఉధృతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ మీటర్ల ఆచూకీ లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆక్సీమీటర్లు వినియోగిస్తున్నారు. దీంతో బాధితులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. కొందరు సొంతంగా కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నారు. తొలినాళ్లలో ఆక్సీమీటర్లతో నిర్థారణ చేసి.. ఆక్సిజన్‌ అవసరమైన వారికి ఆస్పత్రులకు తరలించేవారు. ప్రస్తుతం గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. 


 వినియోగం తప్పనిసరి

కరోనా కేసులు ఉధృతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సీమీటర్ల వినియోగం తప్పనిసరి. గతంలో ఏఎన్‌ఎంలకు అందించిన వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగుచేసి వినియోగంలోకి తెస్తాం. ఏఎన్‌ఎంలు విధిగా ఆక్సీమీటర్లు వినియోగించాలని  ఆదేశాలు జారీచేశాం.

- డాక్టర్‌ లీలా, డిప్యూటీ డీఎంహెచ్‌వో

Updated Date - 2021-05-07T05:09:53+05:30 IST