బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-07-06T05:09:39+05:30 IST

బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ 7న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని యూపీఎస్సీ నాయకులు వలీఅహ్మద్‌, మల్లికార్జున్‌ పిలుపునిచ్చారు.

బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలి
గజ్వేల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఉపాధ్యాయ ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్‌

రేపు ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు పిలుపు

గజ్వేల్‌, జూలై 5: బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ 7న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని యూపీఎస్సీ నాయకులు వలీఅహ్మద్‌, మల్లికార్జున్‌ పిలుపునిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులకు నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల తీవ్ర సంక్షోభం నెలకొన్నదన్నారు. వెంటనే ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ చేపట్టాలని, అంతేకాకుండా 317 జీవో అమలులో అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమ విద్యను ప్రవేశపెట్టడం వల్ల దాదాపుగా లక్షా 70 వేల మంది విద్యార్థులు కొత్తగా పాఠశాలల్లో ప్రవేశం పొందారని, చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకు విద్యావలంటీర్లను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజులు, సత్యనారాయణ, చంద్రారెడ్డి, సుంచు నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధర్నాను విజయవంతం చేయాలి

సిద్దిపేట క్రైం: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ పొన్నమల రాములు అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై 7న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్‌ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

తపస్‌ ఆధ్వర్యంలో 

ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరకాయల తిరుపతి, ఊడెం రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు సిద్దిపేటలోని శిశుమందిర్‌లో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కోర్‌ కమిటీ సభ్యులు శ్రీనకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల బాలకిషన్‌, దేవదాసు, జిల్లా కార్యదర్శులు బేతి భాస్కర్‌, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట అర్బన్‌: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 7న హైదరాబాద్‌లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య, జిల్లా అధ్యక్షుడు వైవీ.సురే్‌షకుమార్‌ కోరారు. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పలు పాఠశాలల్లో మంగళవారం ఉపాధ్యాయులను కలిసి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. 

మిరుదొడ్డి: టీపీటీఎఫ్‌ మిరుదొడ్డి మండలాధ్యక్షుడు పెరుమాండ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భూంపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాలలో 7న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ నాయకులు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:09:39+05:30 IST