గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2021-03-01T05:49:09+05:30 IST

గిరిజన గ్రామాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌ అన్నారు.

గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
నులకమద్దిలో గిరిజనులతో మాట్లాడుతున్న ఏఎస్పీ బిందుమాధవ్‌

  • రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌ 
  • నులకమద్ది, దారలోవ, గన్నవరం గ్రామాల్లో పర్యటన

వై.రామవరం, ఫిబ్రవరి 28: గిరిజన గ్రామాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌ అన్నారు. ఆదివారం ఆయన మండలంలో మారుమూల గ్రామాలైన నులకమద్ది, దారలోవ, గన్నవరంలో పర్యటించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహించిన సహాయక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గ్రామాలకు జీపులో బియ్యం, దుప్పట్లు తదితర సరుకులను తరలించారు. అక్కడ గిరిజనులతో ఏఎస్పీ సమావేశమై మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి పలు సహాయక కార్యక్రమాలను చేపడుతున్నా మన్నారు. గిరిజనులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉన్నత మార్గాలవైపు చైతన్యవంతులు కావాలని సూచించారు. రోడ్డు నిర్మాణాలు, వ్యాపార బ్యాంకులు తదితర మౌలిక వసతులపై సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అనంతరం ఆయా గ్రామాల గిరిజనులకు బియ్యం, పప్పులు, దుప్పట్లు, యువతకు వాలీబాల్‌ కిట్‌లు అందజేశారు. ఆయన వెంట అడ్డతీగల సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ పృధ్వి, సీఆర్‌పీఎఫ్‌, పోలీసు సహాయక సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-03-01T05:49:09+05:30 IST