30, 31 తేదీల్లో అండర్‌-19 క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలు

ABN , First Publish Date - 2021-07-25T06:51:05+05:30 IST

జిల్లా బాలురు, బాలికల క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు టి.హరీష్‌ ఆధ్వర్యంలో ఈనెల 30, 31 తేదీల్లో క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కేఎస్‌ కిరణ్‌రాజు శనివారం తెలిపారు. 30న సీనియర్స్‌, 31న అండర్‌-19 విభాగంలో క్రీడాకారుల ఎంపికలు కాకినాడ ఆర్‌ఎంసీ క్రీడామైదానంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయన్నారు.

30, 31 తేదీల్లో అండర్‌-19  క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలు

కాకినాడ స్పోర్ట్స్‌, జూలై 23: జిల్లా బాలురు, బాలికల క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు టి.హరీష్‌ ఆధ్వర్యంలో ఈనెల 30, 31 తేదీల్లో క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కేఎస్‌ కిరణ్‌రాజు శనివారం తెలిపారు. 30న సీనియర్స్‌, 31న అండర్‌-19 విభాగంలో  క్రీడాకారుల ఎంపికలు కాకినాడ ఆర్‌ఎంసీ క్రీడామైదానంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. అండర్‌-19 ఎంపికలకు సెప్టెంబరు 2002న గానీ, ముందుగానీ జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు కొవిడ్‌- 19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ లేదా ఆర్‌టీపీసీఆర్‌ 48 గంటల ముందు రిజల్ట్‌తో హాజరుకావాలన్నారు. వైట్‌డ్రస్‌, సొంత క్రీడాసామాగ్రితో రావాలన్నారు. వివరాలకు 9494212345 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు విజయనగరం జిల్లాలో త్వరలో జరిగే అంతర్‌జిల్లాల జోనల్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటారని కిరణ్‌రాజు తెలిపారు.

Updated Date - 2021-07-25T06:51:05+05:30 IST