అభ్యుదయ రైతులకు కేంద్ర మంత్రి అభినందన

ABN , First Publish Date - 2021-04-24T05:01:21+05:30 IST

వినూత్న పద్ధతుల్లో వరి పంటను పండించి మంచి దిగుబడి సాధించిన జిల్లాకు చెందిన ఇద్దరు రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాస్‌ చౌదరి అభినందించారు. కటక్‌లో జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ) 75వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించా రు.

అభ్యుదయ రైతులకు  కేంద్ర మంత్రి అభినందన

 సంతబొమ్మాళి: వినూత్న పద్ధతుల్లో వరి పంటను పండించి మంచి దిగుబడి సాధించిన జిల్లాకు చెందిన ఇద్దరు రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి  కైలాస్‌ చౌదరి అభినందించారు. కటక్‌లో జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ) 75వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.  సంతబొ మ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరానికి చెందిన రైతు వాడరేవు చిరంజీవులు గత ఏడాది ఖరీఫ్‌లో ఉప్పు నేలలో ఒక హెక్టార్‌లో 6 టన్నుల దిగుబడి సాధించాడు. కొత్తూరు మండలం గూనభద్రకు చెందిన బుచ్చి వెంకటరమణమూర్తి  సేంద్రియ విధానంలో ఒక హెక్టారు  వరి పంట సాగు చేసి 7 టన్నుల దిగుబగి సాధించాడు. దీంతో వీరిని శుక్రవారం వర్చువల్‌ విధానంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.  ఈ కార్యక్రమంలో జాతీయ వరి పరిశోధన సంస్ద ఒడిశా(కటక్‌) ప్రిన్సి పాల్‌ కె.రాజశేఖర్‌, శాస్త్ర వేత్తలు గాయత్రి, కిరణ్‌ గాంఽధి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-24T05:01:21+05:30 IST