‘ఉపా’ను తక్షణమే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-03-01T05:06:28+05:30 IST

ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద ఉపా చట్టం రద్దుచేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిం చారు.

‘ఉపా’ను తక్షణమే రద్దు చేయాలి


 పలాస రూరల్‌:  ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం  బొడ్డపాడు  అమరవీరుల స్మారక మందిరం వద్ద  ఉపా చట్టం రద్దుచేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేలంగి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనపై ప్రశ్నించేవార్ని ఉపా చట్టం కింద అరెస్టు చేసి గొంతులను మూసి వేస్తున్నారని ఆరోపించారు. జిల్లా పౌరహక్కుల సంఘ అధ్యక్షుడు పత్రి దానేసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమరవీరుల బంధుమిత్రుల సంఘ అధ్యక్షుడు జోగి కోదండ, చైతన్య మహిళ సంఘ నాయకులు పి.అరుణ, కులనిర్మూలన ప్రజాసమితి రాష్ట్రప్రధాన కార్యదర్శి కృష్ణ, ప్రజా కళామండలి నాయకులు కొర్రాయి నీలకంఠం తదితరులు ఉపా చట్టం రద్దుచేయాలని కోరారు.

 

Updated Date - 2021-03-01T05:06:28+05:30 IST