సకాలంలో యూజర్‌ చార్జీలు వసూలు చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-10-27T06:44:54+05:30 IST

ప్రతి ఇంటి నుంచీ సకాలంలో యూజర్‌ చార్జీలు వసూలు చేయాల్సిందేనని సచివాలయ కార్యదర్శులను కమిషనరు గిరీష ఆదేశించారు.

సకాలంలో యూజర్‌ చార్జీలు వసూలు చేయాల్సిందే

తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 26: ప్రతి ఇంటి నుంచీ సకాలంలో యూజర్‌ చార్జీలు వసూలు చేయాల్సిందేనని సచివాలయ కార్యదర్శులను కమిషనరు గిరీష ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు. తిరుపతిలో పారిశుధ్య నిర్వహణపై మంగళవారం ఆయన సెక్టోరల్‌ అధికారులు, సచివాలయ పారిశుధ్య కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. తడి, పొడి చెత్త సేకరణలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతివీధికి నిర్దిష్ట సమయంలో చెత్తసేకరణకు ఆటో వెళ్లేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మీ పరిధిలో దుకాణాలు ఎన్ని, ఇళ్లు ఎన్ని ఉన్నాయనేది అవగాహన ఉండాలన్నారు. ట్రేడ్‌ లైసెన్సులు ఎప్పటికప్పుడు వసూలు చేయాలన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఉప కమిషనరు  చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎ్‌ఫవో జ్ఞానసుందరం, హెల్త్‌ఆఫీసర్‌ డాక్టర్‌ హరికృష్ణ, శానిటరి సూపర్‌వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:44:54+05:30 IST