Advertisement

వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

Feb 28 2021 @ 00:18AM
దస్తగిరిపేట్‌లో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

తాండూరు రూరల్‌: దస్తగిరిపేట్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం కనుల పండువుగా నిర్వహించారు. దస్తగిరిపేట(చంద్రగిరి)గ్రామంలో వెలసిన వేంకటేశ్వరాలయంలో 19వ తేదీ నుంచి 27వరకు ఉత్సవాలు నిర్వహించారు. అర్చకులు రాఘవేంద్రఛార్‌ శుక్రవార్‌-నిర్మల దంపతులు పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను ఆలయం చుట్టూ పల్లకిలో ఊరేగించారు. గోవిందనామ భజనల మధ్య ఆలయం నుంచి రథాన్ని 200మీటర్ల దూరం భక్తులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లాగారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌చైర్‌పర్సన్‌ దీపనర్సింహులు, కౌన్సిలర్‌ శోభారాణి, ఎల్మకన్నె సొసైటీ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ రాములు పాల్గొన్నారు. 

  • మిట్టబాస్పల్లి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

తాండూరు మండలం మిట్టబాస్పల్లిలో సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి కుటుంబం శనివారం శివాలయంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సొసైటీ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, వైస్‌ఎంపీపీ స్వరూప, సర్పంచ్‌లు మేఘనాథ్‌గౌడ్‌, నరేందర్‌రెడ్డి, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

అంబురామేశ్వరాలయంలో మాఘ పౌర్ణమి భజన

తాండూరు మండలం సిరిగిరిపేట్‌ వీరభద్రభజన మండలి, హనుమా న్‌ భజన మండలి ఆధ్వర్యంలో శనివారం అంబురామేశ్వరాలయంలో పూ జలు నిర్వహించారు. అనంతరం భజనలు చేశారు.

సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ

వికారాబాద్‌: వికారాబాద్‌ పరిధి బుగ్గ రామలింగేశ్వరాలయ ఆవరణ లో శుక్రవారం బీజేపీ నాయకుడు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో  సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని నిర్వహించారు. స్వామి వారి కి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, ఆలయ అర్చకులు, పెద్దలు పాల్గొన్నారు. 

బందెల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌: కొడంగల్‌ పట్టణ బందెలమ్మ జాతరలో శనివారం ఎమ్మె ల్యే నరేందర్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనం తరం మున్సిపాలిటిలో జరుగుతున్న అభివృద్ధి, క్యాంప్‌ కార్యాలయ పను లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప, మఽధుయాదవ్‌, మహేందర్‌రెడ్డి, నర్సింహులు, మోహన్‌రెడ్డి, మురారి పాల్గొన్నారు.

చాపలగూడెంలో రుద్రహోమం

కులకచర్ల: చాపలగూడెంలో శివస్వాములు రుద్రహోమాన్ని నిర్వహిం చారు. పౌర్ణమిసందర్భంగా హన్మాన్‌ ఆలయావరణలో హోమం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రహ్లాద్‌రావు, రాంరెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా మాణిక్‌ప్రభు ఉత్సవాలు

పరిగి: మండలంలోని మిట్టకోడూరులో మాణిక్యప్రభు ఉత్సవాలు జరుగుతున్నాయి. శనివారం స్వామివారి పల్లకిసేవ నిర్వహించారు. ఉదయం భక్తులు ఆట, పాటలు, భజనలు, కోలాటాలతో హోరెత్తించారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి గంగాస్నానం చేయించారు. భక్తులకు అన్నదానం చేశారు.

వేణుగోపాల స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు

ఘట్‌కేసర్‌ రూరల్‌: ఎదులాబాద్‌లో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మకర్తలు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. అంతకు ముందు స్వామివారికి పూజలు, సేవాకాలం, తీర్థప్రసాద ఆరగింపు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంబారిపేట అప్పలాచార్యులు, మోహనాచార్యులు, రాంప్రసాదాచార్యులు, వరదరాజులు, ఎబీఎల్‌ఎ న్‌చారి, నారాయణచారి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.