విద్యాలయాల్లోకి ఇతరుల ప్రవేశం నిషేధం

ABN , First Publish Date - 2022-08-19T06:09:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విద్యాలయాల్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించామని గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు గురువారం విలేఖరులకు తెలిపారు.

విద్యాలయాల్లోకి ఇతరుల ప్రవేశం నిషేధం
టీడబ్ల్యూ డీడీ కొండలరావు

- హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌,  గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలను పాటించాలి

- గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ కొండలరావు

పాడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌,  గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విద్యాలయాల్లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించామని గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు గురువారం విలేఖరులకు తెలిపారు. స్థానిక ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోకి ఎటువంటి బయట వ్యక్తులను అనుమతించవద్దని ఇప్పటికే అన్ని గిరిజన విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌ ఆదేశాలను కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల నిర్వాహకులు కచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. దీనిని పాటించకపోతే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంరక్షకులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-08-19T06:09:59+05:30 IST