
వికారాబాద్: జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైతు శంకర్ సోమవారం రాత్రి పొలం దగ్గర పశువులపై చిరుత దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది. చిరుత ఆనవాళ్లను గుర్తించిన రైతు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.