పశుసంవర్థక శాఖ శాస్త్రవేత్తల సందర్శన

ABN , First Publish Date - 2021-02-26T04:03:11+05:30 IST

గొర్రెజాతి కొత్త రకం విత్తనం గుర్తించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో క్షేత్రస్థాయి పరిశోధనలు జరుపుతున్నట్టు ఢిల్లీకి ఎన్‌బీఏజీఆ ర్‌ఎస్‌కు చెందిన పశుసంవర్థక శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కేఎన్‌ రాజా, మిశ్రాలు తెలిపారు.

పశుసంవర్థక శాఖ శాస్త్రవేత్తల సందర్శన
గొర్రెలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు




దబ్బపాడు (ఎల్‌ఎన్‌పేట), ఫిబ్రవరి 25: గొర్రెజాతి కొత్త రకం విత్తనం గుర్తించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో క్షేత్రస్థాయి పరిశోధనలు జరుపుతున్నట్టు ఢిల్లీకి ఎన్‌బీఏజీఆ ర్‌ఎస్‌కు చెందిన పశుసంవర్థక శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కేఎన్‌ రాజా, మిశ్రాలు తెలిపారు. దబ్బపాడు, లక్ష్మీనర్సుపేటలో గురువారం గొర్రెలను పరిశీలించారు. పెంపకందారులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. మేత విధానం, గొర్రెల ఉత్పత్తిని అడిగి తెలు సుకున్నారు.. గొర్రెల ఎత్తు, పెరుగుదల, కొమ్ములు, పళ్లును కొలతలవేసి వాటి ఎదుగుదలకు సంబంధించి వివరాలు రాబెట్టారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాగావళి రకానికి చెందిన గొర్రెల పెరుగుదలపై పరిశోధనలు జరుపుతున్నట్టు చెప్పారు. వారితో పాటు ఐఎస్‌డీపీ ఏడీ నారాయణరావు, గరివిడి వెటర్నరీ సర్జన్‌ డి. మోహన్‌వంశీ, పురుషో త్తం, వెటర్నరీ సహాయకులు సీహెచ్‌ రాంప్రసాద్‌, ఐ.తిరుమలరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.





Updated Date - 2021-02-26T04:03:11+05:30 IST