వర్షాల కోసం ఎదురుచూపు

Jun 17 2021 @ 00:14AM
దుక్కి చేస్తున్న రైతు

  • కారుమబ్బుల దోబూచులాట!
  • చెలకల్లో విత్తేందుకు దాటుతున్న అదును
  • దుక్కులు చేసి దిక్కులు చూస్తున్న రైతులు

పరిగి: ఈ సారి వర్షాలు బాగానే కురుస్తాయనే విధంగా తొలకరి జల్లులు పడినా పెద్ద వానల్లేక రైతుల్లో నిరాశ కలుగుతోంది. పది రోజుల క్రితం ఒక వర్షం కురిసింది. దీంతో రైతులు దుక్కులు దున్నుకున్నారు. కొందరు వేసవి దుక్కులు చేసుకున్న వారు విత్తనాలు నాటారు. అటు నుంచి రోజూ మేఘావృతమే అవుతున్నా చినుకు రాలడం లేదు. సాధారణంగా వర్షపాతం భారీగానే నమోదయ్యే రోహిణి పోయింది. మృగశిర కా ర్తె సగం దాటింది. ఇప్పటికే చెల్కల్లో విత్తడం పూర్తి కావాల్సి ఉంది. పెద్ద వానల్లేక రైతులు దిగులు చెందుతున్నారు. భూములు చదును చేసి సిద్ధ అయ్యారు. పది రోజులుగా చిరుజల్లులే తప్ప  పెద్ద వానలు పడలేదు. 


  • సబ్సిడీ విత్తనాలివ్వని ప్రభుత్వం


గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు మండల కార్యా లయాల్లో, సొసైటీల్లో అమ్మేది. ఈ మధ్య కాలంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ చేయడం లేదు. రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొంటున్నారు. జిల్లాలో వివిధ రకాల పంటలు 5.90లక్షల ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయ అధికారులంటున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంట లే ఎక్క్కువగా సాగుచేస్తారు. ఈ సారి మొక్కజొన్న సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పత్తి గతేడాది 2లక్షల ఎకరాల్లో వేశారు. ఈ సారి 2.7లక్షల ఎకరాలకు పెరిగే ఆస్కారం ఉంది. కంది 1,75,900 ఎకరా లు, 80వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి 35వేల ఎకరాలు, పెసర 20,800, జొన్న 15వేలు, మినుములు 9,500ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖాదికారులు ప్రణాళికలు రూపొందించారు. గత ఏడాదిగా మాదిరే ఈ సారి కూడా భారీగానే సాగుచేస్తారని అంచనా వేస్తున్నారు.

Follow Us on: