డీజిల్‌లో నీళ్లు వచ్చాయని ఆందోళన

ABN , First Publish Date - 2021-07-26T03:31:43+05:30 IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం కిసాన్‌నగర్‌లోని కల్తీ డీజిల్‌ విక్రయిస్తున్నారని రైతులు ఆదివారం ఆందోళన చేశారు. బంకులో ఆదివారం ఉదయం 50 మంది డీజిల్‌లో పోసుకోగా నీళ్లు వచ్చాయని 50 మంది వినియోగదారులు ఆరోపించారు. పొలం పనుల కోసం బంక్‌ నుంచి తీసుకువెళ్లిన డీజిల్‌ను ట్రాక్టర్‌లో నింపిన అనంతరం పొలం దున్నుతుండగా ట్రాక్టర్లు మొరాయించాయి. ట్యాంక్‌లో నింపిన డీజిల్‌ను పరిశీలిస్తే అందులో నీళ్లు కలిసి ఉండటంతో రైతులు అవాక్కయ్యారు. దీనిపై బంక్‌ యజమాన్యాన్ని ప్రశ్నించారు.

డీజిల్‌లో నీళ్లు వచ్చాయని ఆందోళన
డీజిల్‌లో నీళ్లు వచ్చాయని బంక్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల

హుస్నాబాద్‌ మండలం కిసాన్‌నగర్‌లో సంఘటన

బంకును సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు


హుస్నాబాద్‌ రూరల్‌, జూలై 25 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం కిసాన్‌నగర్‌లోని కల్తీ డీజిల్‌ విక్రయిస్తున్నారని రైతులు ఆదివారం ఆందోళన చేశారు. బంకులో ఆదివారం ఉదయం 50 మంది డీజిల్‌లో పోసుకోగా నీళ్లు వచ్చాయని 50 మంది వినియోగదారులు ఆరోపించారు. పొలం పనుల కోసం బంక్‌ నుంచి తీసుకువెళ్లిన డీజిల్‌ను ట్రాక్టర్‌లో నింపిన అనంతరం పొలం దున్నుతుండగా ట్రాక్టర్లు మొరాయించాయి. ట్యాంక్‌లో నింపిన డీజిల్‌ను పరిశీలిస్తే అందులో నీళ్లు కలిసి ఉండటంతో రైతులు అవాక్కయ్యారు. దీనిపై బంక్‌ యజమాన్యాన్ని ప్రశ్నించారు. దాదాపు 50 మంది రైతులు తామందరికీ ఇదే అనుభవం ఎదురైందని ఆందోళన చేపట్టారు. కల్తీ డీజిల్‌ విక్రయిస్తున్న బంకు యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ వెంకటేశ్‌, ఏఎస్వో వచ్చి బంక్‌ను తనిఖీ చేశారు. డీజిల్‌ నమూలను సేకరించి పరీక్షా కేంద్రానికి పంపించారు. నివేదిక వచ్చేవరకు తాత్కాలికంగా బంక్‌ను సీజ్‌ చేస్తున్నట్టు ఆర్‌ఐ వెల్లడించారు. 

Updated Date - 2021-07-26T03:31:43+05:30 IST